జాతీయ రుగ్మత
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
క్రికెట్ క్రీడాభిమానులకు ఆనంద్నా కలిగించే
ఆట -ప్రపంచంలో చాలా దేశాలలో. కా మన దేశంలో అది జబ్బు. జూదాకి ఆలంబన.
వ్యాపార సాధనం. రాజకీయ లబ్ధికి పెట్టుబడి. అవీతికి అవకాశం. అజ్ఞానులకీ,
అడ్డమయిన వాళ్లకీ ఫాషన్ సింబల్. వెరసి -క్రీడ తప్ప మిగతా అన్నీను.
1975 లో రిలీజయిన హాలీవుడ్ చిత్రం ''మాన్ ఫ్రైడే'' గొప్ప చిత్రం. రాబిన్‌సన్
క్రూసో అనే నావికు నౌక మెరకలో దిగబడి ఒక ద్వీపంలో లిచిపోతాడు క్నొ
సంవత్సరాలపాటు. అత దగ్గర బంగారు నాణాలు ఉన్నాయి. మఖమల్ వస్త్రాలున్నాయి.
అd్న ఉన్నాయి. కా అనుభవించే అవకాశం లేదు. ఆ ద్వీపాకి బందీ అతను. ఓ సారి ఓ
చిన్న పడవ గాలివాలుకి కొట్టుకు అటువేపు చేరింది. అందులో నలుగురు నల్లవాళ్లు
ఉన్నారు. చేతిలో ఉన్న తుపాకీతో ముగ్గుర్ని చంపాడు. ఒకడు బతికాడు. శరణు
జొచ్చాడు. అత్న తన బాస చేసుకున్నాడు. శుక్రవారం నాడు దొరికాడు కనుక అతకి
ఫ్రైడే అ నామకరణం చేశాడు. నెమ్మదిగా ఇంగ్లీషు భాష అర్థం చేసుకోవడం
ప్రారంభించాడు నల్లవాడు.
''ఇకనుంచీ నేను నీ యజమనిని'' అన్నాడు తెల్ల క్రూసో.
''ఎందుకు బాస్?'' అన్నాడు ఫ్రైడే.
ఒక్కక్షణం ఆలోచించాడు క్రూసో. ''నా దగ్గర తుపాకీ ఉంది కనుక''. ఇప్పటికీ ఈ
ఒక్క కారణాకే తమ గొప్పతన్నా మనమీద రుద్దుతున్న పెద్ద దేశాలు ఉన్నాయి.
హింసించడం,ఎదుటి వ్యక్తి జీవన్నా నాశనం చేయగలగడం -పెద్దరికం, అధికారం. ఇది
నవల. అద్భుతం.
బంతాట ఆడదామంటాడు క్రూసో. ''క్రీడ అంటే ఏమిటి?'' నల్లవాడి ప్రశ్న.
మళ్లీ ఆలోచనలో పడ్డాడు తెల్లవాడు. చివరికి సమాధానం దొరికింది. ''మన సంతోషం
కోసం ఎదుటివాడి హింసించడం''
నాగరిక ప్రపంచంలో అ్న సంస్కారాల్నీ ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలతో దుయ్యపట్టింది
రచయిత్రి. దీకి ఓ నల్ల మహిళ రచయిత్రి అ గుర్తు.
ప్రస్తుతం క్రికెట్ ఎన్నోరకాల 'హింస'లకు ఆటపట్టు.
ఈ మధ్య కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతూంటే డాక్టర్‌కి ఫోన్ చేశాను. చాలాసేపటి
వరకూ ఫోన్ తియ్యలేదాయన. తీరా తీశాక చాలా ఉత్తేజంగా ఉన్నాడు. ఆయనేదైనా
ఆయాసంతో, జబ్బుతో బాధపడుతున్నాడేమోన భయమేసింది.
''బాగున్నారా? అ డాక్టర్ని నేనడిగాను.
పరాకుగా ''ఊ'' అన్నాడు. చెవులు పగిలేలాగ టీవీలో కేకలు విపిస్తున్నాయి. నా
రుగ్మత చెప్పబోయాను. ''ఓ అరగంట తర్వాత ఫోన్ చేస్తారా?'' అన్నాడు ఇబ్బందిగా.
ఏదయినా ఆపరేషన్ హడావుడిలో ఉన్నాడేమో. లేదా అతి ముఖ్యమైన పేషెంట్
చూస్తున్నాడేమోననుకున్నాను. కా సచిన్ తెందూల్కర్ వెస్ట్ ఇండీస్‌లో 80
పరుగుల స్కోర్‌లో ఉన్నాడు. ఇంకో 20 పరుగుల్లో వంద వందల పరుగులు తీసిన ఘనత
దక్కుతుంది. మా డాక్టర్‌గారికి ఊపిరి తిరగడం లేదు. టీవీ ఆన్ చేశాను. దేశంలో
ఛానల్స్ అd్న ఒకే విషయ్నా ప్రసారం చేస్తున్నాయి. సచిన్ జీవితం, అత
చిన్నతనం, బొంబాయిలో తొలినాళ్లలో ప్రాక్టీసు, అత విజయాలు, అతకి భారతరత్న
యివ్వవలసిన అవసరం, అత వినయ సంపద, ప్రతిభ -రకరకాల మనుషులు ఆవేశంగా
చెప్తున్నాను. మధ్య మధ్య క్రికెట్ చూపిస్తున్నాను. బహుశా గాంధీ జయంతినాడు
గాంధీగారి కూడా ఇంత భక్తిగా, ఇంత ఆవేశంతో స్మరించి ఉండరేమో!
దేశంలో అ్న కార్యకలాపాలూ లిచిపోయాయి. జన జీవనం స్థంభించిపోయింది. ఎందుకు?
సచిన్ వందవ సెంచరీ కోసం. ఎవరి పలకరించినా అదేమాట.
''బాబూ! కడుపునొప్పి!''
''dకు బుద్ధి ఉందా లేదా? అక్కడ సచిన్ సెంచరీ కొడుతున్నాడు -ఇప్పుడా
దిక్కుమాలిన కడుపునొప్పి?''
పెళ్ల్నా కాఫీ అడిగినా దక్కదు. ''ఇప్పుడేమిటండీ? సచిన్ సెంచరీ కావ్వండి
బాబూ మీకు పుణ్యముంటుంది''.
ఆ క్షణంలో సచిన్ జాతీయ విపత్తు.
రిక్షావాళ్లకీ, పాన్ షాపులవాళ్లకీ, మరమరాల దుకాణాల వాళ్లకీ యిప్పటికీ
క్రికెట్ లోతుపాతులు తెలీవు. కా అది జరుగుతూండగా తన టీవీలకీ, రేడియోలకీ
గిరాకీ పెరుగుతుంద తెలుసు. థర్డ్ మాన్, తీస్రా, గుగ్లీ, యార్కర్‌లంటే
బొత్తిగా తెలీదు. నాలుగు పరుగులకు బంతి వెళ్లింది. అరుపులు. ''కొట్టమనండి
బాబూ. ద్రావిడ్ అయినా నాలుగు దెబ్బలు కొడితే మన పరువు లుస్తుంది. అందాకా ఓ
కిళ్లీ బిగించండి గురువుగారూ'' ఇదీ ధోరణి. క్రికెట్ గురించి మాట్లాడడం ఓ
ఫాషన్, నాగరికతకి చిహ్నం, స్టేటస్ సింబల్. ఆధుక జీవన కృత్రిమత్వంలో కీలక
స్థానంలో క్రికెట్ ఉంది ప్రస్థుతం.
ఇది ఒక పార్శ్వం. ఇవd్న తెలియ, తెలియనక్కరలే రాజకీయ నాయకులు -కేవలం
అధికారాకి, తేనెపట్టులాగ డబ్బుతో బలిసి ఉన్న వ్యాపార్నా కొల్లగొట్టడాకి
క్రికెట్ సంస్థల పదవులు చేపడతారు. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిగారు విశాఖ
సాహితికి అధ్యక్షులుగా ఉంటారా? ప్రతిభా పాటిల్ తెనాలి నాటక సంస్థకి ప్రధాన
పోషకురాలిగా ఉంటారా? (ఇది నవ్వులాటగా అంటున్న మాట కాదు. ఇంగ్లండులో
షేక్స్పియర్ నాటకం కంపెd ప్రధాన పోషకురాలు ఎలిజబెత్ మహారాణి.) మన దేశంలో
క్రికెట్ కంట్రోలు బోర్డ్ అధ్యక్షుడు శరద్ పవార్, బీహార్ క్రికెట్
సంస్థ అధ్యక్షులు లల్లూ గారు! ఇప్పుడిప్పుడు ఏడాది పొడుగునా క్రికెట్
సాగుతోంది. ఇదివరకు ఏడాదికి ఒక సీజన్‌లోనే సాగేది. ఐసిఎల్, ఐపిఎల్,
రంజీట్రోఫీ, మరేదో మరేదో. క్రీడాకారుల్ని సంతలో పశువుల్లాగ వేలం వేస్తారు.
ఆటల మీద జూదాలు సాగుతాయి. జూదగాళ్లకి అనుకూలంగా ఆట తగలబెట్టే ప్రబుద్ధుల
కథలు ఈ మధ్యనే వెలుగుచూశాయి.
ఇదో ప్రపంచం. వేలం వెర్రి. ప్రపంచంలో మనదేశమే ప్రస్తుతం క్రికెట్‌లో
అవమానాల పాలవుతోంది. కా వెర్రి విషయంలో, డబ్బు విషయంలో మనల్ని కొట్టేవాడు
లేడు. ఆట జరుగుతూండగా కోట్ల రూపాయలు చేతులు మారతాయి. ప్రతిభలోకాక
పెట్టుబడిలో భారతదేశం ముందుంది. క్రికెట్ ఆట రోజున ఆఫీసుల్లో పని
లిచిపోతుంది. వ్యాపారాలు ఆగిపోతాయి. రోడ్లమీద వాహనాలు స్థంభించిపోతాయి.
జనజీవనం అస్తవ్యస్తమయిపోతుంది. కోట్లాదిమంది పనులు మానుకు టీవీలకీ,
రేడియోలకీ అతుక్కుపోతారు. ఎ్న లక్షల కోట్ల మానవశక్తి (మాన్ అవర్స్) వృధా
అవుతోందో ఆలోచించే నాథుడు లేడు.
గత నెల రోజులుగా దేశం క్రుంగిపోయివుంది. కారణం -భారతదేశం ఆస్ట్రేలియా
చేతుల్లో చిత్తుగా ఓడిపోతోంది. ఏ బాట్స్‌మేనూ రాణించడం లేదు. దేశమంతా దిగాలు
పడిఉంది. టీవీలు పెడితే బ్లేడులూ, పాలపీకలూ, టైర్లూ, మందులూ, ఇన్సూరెన్స్‌లూ,
పౌడర్లూ అమ్ముతూ అందంగా కపించే క్రీడాకారులు వెర్రిముఖాలు వేసుకు మనకు
దర్శన మిస్తున్నారు. దేశం విషాదంలో ముగిపోయింది.
సెంచరీ కొట్టడం సచిన్ పకదా? దాకోసం అతను బెంగపెట్టుకోవాలి కదా? దేశం
ఎందుకిలా విలవిలలాడుతుంది? అధవా సచిన్ సెంచరీ కొడితే ఏలూరులో మరమరాల వాడికి
ఏం లాభం? చెప్పమనండి. ఇది దేశభక్తా? క్రికెట్ భక్తా? సచిన్ భక్తా? పిచ్చా?
నాకూ క్రికెట్ అంటే యిష్టం. కారణం -ముఖ్యంగా దాకీ నా తెలివితేటలకీ ఏమీ
సంబంధం లేదు. కొట్టేవాడి ప్రతిభకీ, ఆటకీ సంబంధం. సచిన్ బాగా కొట్టినా,
సచిన్ ఎదుటివాడు తెలివిగా అవుట్ చేసినా నాకు ఆనందం, అబ్బురపాటు కలుగుతాయి.
క్రీడ నా ఆనందం. ఇండియా గెలవడం మాత్రమే కాదు. ర్ణయించేది ఆనాటి ప్రదర్శన కా
మరొకటి కాదు కనుక. క్రీడ ఏకపక్షంగా చూస్తే అది క్రీడ అపించుకోదు. అసలు
క్రీడ ఉద్దేశం అదే. షార్జాలో ప్రేక్షకులకు పాకిస్తాన్ గెలవడమే ఆనందం. మనకి
సచిన్ సెంచరీయే జీవితలక్ష్యం. ప్రస్తుతం వినోదం ముదిరి వికారమయి, కోట్లాది
మంది ర్వీర్యుల్ని చేసే మత్తుమందుగా తయారయింది. ఎందరో దీన్ని
వ్యాపారంగా డబ్బు చేసుకుంటున్నారు. ఎక్కువమంది దీని జబ్బు చేసుకుంటున్నారు.
రాబిన్సన్ క్రూసో ఇవాళ ఉంటే ':ఒక జాతి ర్వీర్యం చేసే అద్భుతమైన వ్యాపార
సాధనం క్రికెట్'' అనేవాడేమో!
వెనకటికి చలం 'ప్రపంచం బాధ శ్రీశ్రీది' అన్నాడు మహాప్రస్థానాకి ముందుమాట
రాస్తూ. ప్రస్తుతం సచిన్ సెంచరీ బాధ దేశాకి పట్టిన బాధ. ఆయన త్వరగా ఆ
సెంచరీ కొట్టేసి భారతరత్న తీసేసుకుంటే దేశం ఈ బాధ నుంచి విముక్తం అయే
అదృష్టం కలుగుతుంది.
జనవరి
23, 2012
************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |