|
ప్రతినెలా ఈ శీర్షిక సినీ
గీతాభిమానులకు సత్కాలక్షేపం..!
సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ
పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, గీతరచయిత పేరు కూడా కనుక్కోవడమే మీరు
చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
**** |
(1)
బోసినీర్విప్పితే – ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే – వరహాల వర్షమే! |
(2)
బ్యాంకులో డబ్బు
దాచేవారు
నీశక్తిని గమనించరు వారు |
(3)
బలవంతులు దోచేసిన
రాజ్యం
ప్రజలందరికి భోజ్యం కాదా |
(4)
మీనులాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నామదిని జప్తుచేసినై |
(5)
వలపను మాటలోన ముందే వుంది – వల
కలవారి కావ్యములో తొలిపలుకే – కల |
(6)
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది |
(7)
నీళ్ళు లేని
ఎడారిలో కన్నీళ్ళయిన తాగి బతకాలి |
(8)
నిదుర మబ్బులను మెరుపుతీగవై
కలలు రేపినది నీవే |
(9)
కురిసేదాకా
అనుకోలేదు శ్రావణ మేఘమని
|
(10)
నది
దోచుకుపోతున్న నావను ఆపండి
|
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..! |
(1)
మాలపిల్ల
బసవరాజు అప్పారావు
కొల్లాయిగట్టితే నేమి – మా గాంధి కోమటై పుట్టితే నేమి?
(2)
రోజులు మారాయి
కొసరాజు
కల్లాకపటం కానని వాడా(3)
నేటి భారతం
శ్రీశ్రీ
అర్థరాత్రి స్వతంత్రం – అంధకార బంధురం
(4)
మాయింటి మహలక్ష్మి
ఆరుద్ర
నువ్వంటేనే నాకు మోజు
(5)
బంగారుపిచిక
ఆరుద్ర
మనసే గని – తరగని గని
(6)
చిల్లర దేవుళ్ళు
ఆత్రేయ
కలువకు చంద్రుడు ఎంతో దూరం
(7)
గోరంతదీపం
సినారె
గోరంతదీపం – కొండంత వెలుగు
(8)
కన్నెవయసు
దాశరథి
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
(9)
పంతులమ్మ
వేటూరి
మానసవీణా మధుగీతం
(10)
ముత్యాలముగ్గు
గుంటూరు శేషేంద్రశర్మ
నిదురించే తోటలోకి |
|
|