ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

  

(1) ఆంధ్రసాహిత్య చరిత్ర వ్రాసిన ప్రసిద్ధులలో ఒకరు

(ఎ) సురవరం ప్రతాపరెడ్డి (బి) పింగళి లక్ష్మీకాంతం (సి) గిడుగు రామ్మూర్తి పంతులు (డి) సి.నారాయణరెడ్డి. 

(2) తిట్టుకవులుగా ప్రసిద్ది చెందిన వారిలో ఒకరు

    (ఎ) ఝలక్ శాస్త్రి (బి) కనుపర్తి అబ్బయామాత్యుడు (సి) తెనాలి రామలింగడు (డి) నన్నెచోడుడు 

(3) దిగంబర కవులలో ఒకరు

    (ఎ) రంగనాయకమ్మ (బి) శ్రీశ్రీ (సి) గద్దర్ (డి) భైరవయ్య 

(4) మ్వీఎల్ - హాస్యరచయిత, సినీ నిర్మాత, కళాశాలాధ్యాపకుడు పూర్తిపేరు

     (ఎ)నరసింహారావు (బి) నరసింహమూర్తి (సి) నరసింహశాస్త్రి (డి) నరసింహాచార్యులు 

(5) 'మధురశ్రీనాధ' బిరుదు పొందిన కవి.

     (ఎ) కరుణశ్రీ (బి) జాషువా (సి) సినారె (డి) దాశరధి 

(6) చంపూకావ్యంలో ఈ రెండూ కలిసి వుంటాయి

    (ఎ) పద్యాలు, శ్లోకాలూ (బి) శ్లోకాలూ, గేయాలు (సి) పద్యాలు, వచనమూ (డి) వచనమూ, మంత్రమూ

(7) కసుమేషువు

    (ఎ) విష్ణుమూర్తి (బి) మన్మధుడు (సి) కుమారస్వామి (డి) బ్రహ్మ 

(8) దళవాయి

     (ఎ) సేనాధిపతి (బి) మంత్రి (సి) సామంతరాజు (డి) అశ్వశాల సంరక్షకుడు 

(9) భ్రామరము

(ఎ) తేనె (బి) తుమ్మెద (సి) సీతాకోక చిలుక (డి) తామరపువ్వు 

(10) విపుల

(ఎ) ప్రపంచము (బి) రోదసి (సి) సముద్రము (డి) భూమి 

(11) మా కొలది జానపదులకు / నీ కవనపుఠీవి అబ్బునే / కూపనట / ద్భేకములకు గగనధునీ శీకరముల

చెమ్మా / నందిసింగయతిమ్మ / - తెనాలి రామకృష్ణుడు ఎవరి గురించి చెప్పిన పద్యం?

    (ఎ) శ్రీకృష్ణ దేవరాయలు (బి) నంది తిమ్మన (సి) రామరాజభూషణుడు (డి) ధూర్జటి 

(12) నీలమేఘచ్చాయ బోలు దేహమువాడు / ధవళాబ్జ పత్ర నేత్రములవాడు... ఏ రామాయణంలోని పద్యం

      (ఎ) కందరామాయణం (బి) రామాయణ కల్పవృక్షం (సి) మొల్ల రామాయణం (డి) ఉత్తర రామాయణం

(13) శోభన్‌బాబు నటించిన తొలిచిత్రం

      (ఎ) వీరాభిమన్యు (బి) భక్తశబరి (సి) సీతారామకల్యాణం (డి) దైవబలం 

(14) 'మహల్లో కోకిల ' నవల ఆధారంగా నిర్మింపబడ్డ చిత్రం

      (ఎ) రాజమహల్ రహస్యం (బి) అన్వేషణ (సి) కోకిల (డి) సితార 

(15) తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో మొదటిసారిగా ఎవర్డులు తెచ్చిపెట్టిన సినిమా

      (ఎ) మా భూమి (బి) దాసి (సి) రుద్రవీణ (డి) టాగూర్ 

(16) 'నా మదియే ఒక మందిరమై - నీవే ఒక దేవతవై'

       (ఎ)గులేబకావళి కథ (బి) మనసే మందిరం (సి) సుమంగళి (డి) మా బాబు 

(17) ఫిగరుమాట పక్కనెట్టు గురూ గురూ - ఫ్రెండు తోటి మందుకొట్టు గురూ గురూ

      (ఎ) సిరివెన్నెల (బి) వేటూరి (సి) కొసరాజు (డి) సామవేదం షణ్ముఖశర్మ 

(18) కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే - అయ్యో. కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే  

      (ఎ) అర్ధాంగి (బి) లక్ష్మీనివాసం (సి) పంతాలు పట్టింపులు (డి) జల్సారాయుడు 

(19) చింత చిగురు పులుపనీ - చీకటంటే నలుపనీ, చెప్పందే తెలియని చిన్నపిల్ల

      (ఎ) చిల్లరకొట్టు చిట్టెమ్మ (బి) కన్నెవయసు (సి) బంగారక్క (డి) ఓ సీతకథ   

(20) సహధర్మచారిణి సరిలేని వరమని - సత్యాన్ని కనలేనివాడు - మోడుగా మిగలడా తమ్ముడు

      (ఎ) ఇంటికి దిపం ఇల్లాలు (బి) ఇల్లాలు (సి) పవిత్రబంధం (డి) కన్నతల్లి


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!