ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

(1) ఓ పువ్వు  పూసింది కథా రచయిత

     (ఎ) మధురాంతకం రాజారాం (బి) లత (సి) చలం (డి) విశ్వనాధ సత్యనారాయణ
 

(2) 'శారద' కలం పేరుతో 90 ఏళ్ళ క్రిందట లేఖా సాహిత్యాన్ని రచించిన తొలి రచయిత్రి

      (ఎ) లత (బి) మాలతీ చందూర్ (సి) కనుపర్తి వరలక్ష్మమ్మ (డి) బండారు అచ్చమా

 

(3) బైబిల్‌కు సరళమైన తెలుగులో వ్యాఖ్యానం వ్రాసిన రచయిత

     (ఎ) కొలకలూరి ఇనాక్ (బి) జాషువా (సి) చలం (డి) జాలాది

 

(4) 'గోరింటాకు ' నవలా రచయత / త్రి

     (ఎ) రంగనాయకమ్మ (బి) లత (సి) కొమ్మూరి వేణుగోపాలరావు (డి) మాలతీ చందూర్

 

(5) కాశి జనలోక సంకల్ప కల్పవల్లి / కలుష పిశితంబు మెసపు రాకాసి కాశి  

     (ఎ) నన్నయ (బి) శ్రీనాధుడు (సి బమ్మెర పోతన (డి) పిల్లలమర్రి చిన వీరభద్రుడు

 

(6) చినుకు కంటికి నురగలెత్తె సింధువొక స్వప్నం - కలం కంటికి నోటికెక్కె గ్రంధమొక స్వప్నం

      (ఎ) శ్రీ శ్రీ (బి) దాశరధి (సి) ఆరుద్ర (డి) సినారె

 

(7) నేను సైతం, కిళ్ళీకొట్లో, పాతబాకీ లెగర గొట్టాను / నేను సైతం జనాభాలో సంఖ్యనొక్కటి వృద్ది చేశాను

     (ఎ) ఝరుక్  శాస్త్రి (బి) జొన్నవిత్తుల (సి) హాసం రాజా (డి) శ్రీశ్రీ

 

(8) దేవ నీవు లేని గుడి బ్రార్ధించు కంటె / బానశాలను సత్యంబు పలుకమేలు

     (ఎ) ఆదిభట్ల నారాయణ దాసు (బి) చలం (సి) దాశరధి (డి) దువ్వూరి రామిరెడ్డి.

 

(9) జక్కదనమున కొక వింత చక్కదనము / జవ్వనంబున కొక వింత జవ్వనంబు

      (ఎ) నలదమయంతి (బి) కాశీఖండం (సి) మనుచరిత్ర (డి) పారిజాతాపహరణం

 

(10) నామరులు (నామా + మరులు)

       (ఎ) మెలికపాములు (బి) పాచికలు (సి) పిచ్చుకలు (డి) తొలికారు వాన చినుకులు   

 

(11) గాధేయుడు

     (ఎ) కర్ణుడు (బి) విశ్వామిత్రుడు (సి) విఘ్నేశ్వరుడు (డి) దూర్వాసుడు 
 

(12) మదిర

       (ఎ) కల్లు (బి) తేనె (సి) తుమ్మెద ఝూంకారము (డి) తటాకంలోని చిన్నపాటి అల

 

(13) 'తలనిండ పూదండ దాల్చిన రాణి ' వ్రాసినవారు

        (ఎ) ఘంటసాల (బి) కరుణశ్రీ (సి) దాశరథి (డి) దేవులపల్లి

 

(14) ఆవేశం కావాలి ఆకదన కావాలి - ప్రతి మనిషీ క్రాంతి కొరకు - రుద్రమూర్తి కావాలి

       (ఎ) పదండి ముందుకు (బి) మనసు మాంగల్యం  (సి) రణభేరి (డి) దేశమంటే మనుషులోయ్

 

(15) కంసుని చెరసాలలో ఖైదీవై పూట్టావు - కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు

       (ఎ) శ్రీకృష్ణ లీలలు (బి) బుద్దిమంతుడు (సి) రంగులరాట్నం (డి) అంతా మనమంచికే

 

(16) అందాలే బంధాలై నను బందీ చేసెనులే - కలవరమిక ఎందుకులే వలదన్నా వదలనులే

        (ఎ)మాయాబజార్ (బి) కృష్ణార్జున యుద్దం (సి) అప్పుచేసి పప్పుకూడు (డి) పెళ్ళిచేసి చూడు

 

(17) అమ్మా నొప్పులే - అమ్మమ్మా నొప్పులే

       (ఎ) కొసరాజు (బి) రావూరు సత్యనారాయణ (సి) ఊటుకూరి సత్యనారాయణ (డి) వీటూరి

 

(18) నాదం 'న కారం మంత్రం ' మకారం...

       (ఎ) సిరివెన్నెల (బి) స్వర్ణకమలం (సి) సాగర సంగమం (డి) స్వాతి కిరణం

 

(19) నీ జతలో క్షణమైనా బతుకుని చరితగ మార్చేస్తుంది

       (ఎ) శుభాకాంక్షలు (బి) మాఘమాదం (సి) రంగేళి (డి) ప్రేమకథ

 

(20) పిచ్చోడెవరో జుట్టులు పీక్కొని ఎన్నో కనిపెట్టు / పైసాలంటే అదే నీకు అన్ని కొనిపెట్టు

        (ఎ) మనీ (బి) మనసిచ్చిచూడు (సి) రధసారధి (డి) లిటిల్ సోల్జర్స్

 

(21) సాగరమే పొంగుల నిలయం - దానికి ఆలయం సంధ్యా సమయం  

        (ఎ) తాతా - మనవడు (బి) సీతారాములు (సి) గోరింటాకు (డి) ముద్దబంతి

 

(22) నువ్వూ నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం - నువ్వూ నేను మనమైతేనే ఇంకెంతో యిష్టం

        (ఎ) గంగోత్రి (బి) ఆర్య (సి) రంగస్థలం (డి) ఔను వాళ్ళిద్దరూ యిష్టపడ్డారు.

 

(23) 'సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా ' -

        (ఎ) సిరివెన్నెల (బి) రామజోగయ్య (సి) చంద్రబోస్ (డి) అనంత శ్రీరాం

 

(24) రాలుపూల తేనియకై రాతి పూల తుమ్మెదనై

        (ఎ) వేటూరి (బి) సిరివెన్నెల (సి) ఆత్రేయ (డి) సినారె
 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!