ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

 (1) శ్రీశ్రీ పాటలు వ్రాసిన తొలి చిత్రం

(ఎ) కాలచక్రం (బి) ఆహుతి (సి) జింబో నగర ప్రవేశం (డి) కన్యాశుల్కం

 

(2) తొలి నిషేధిత చిత్రం

(ఎ) వందేమాతరం (బి) మాలపిల్ల (సి) సారంగధర (డి) రైతుబిడ్డ

 

(3) 'వరవిక్రయం ' చిత్రంలో భానుమతితో పాటు చిత్రరంగ ప్రవేశం చేసిన మరో నటి

(ఎ) బాలసరస్వతి (బి) కృష్ణవేణి (సి) కన్నాంబ (డి) పుష్పవల్లి

 

(4) ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అంధత్వంలో కూడా సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు  

(ఎ) బి.ఎస్.నారాయణ (బి) రఘుపతి ప్రకాష్ (సి) సురభి శంకర్ ప్రసాద్ (డి) జంపన చంద్రశేఖరరావు.

 

(5) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు దర్శక, నిర్మాత

(ఎ) బి.నాగిరెడ్డి  (బి) బి.ఎన్.రెడ్డి (సి) డి.రామానాయుడు (డి) పైడి జైరాజ్

 

(6) ఆంధ్రరాష్ట్రంలో  తొలి ఏసి థియేటర్

(ఎ) రామకృష్ణ 70ఎం.ఎం. (బి) వైజాగ్ జగదాంబ (సి) సికిందరాబాద్ పేరడైజ్ (డి) గుడివాడ శరత్

 

(7) మృచ్చకటిక సంస్కృత నాటకం ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రం

(ఎ) నర్తనశాల (బి) కుంతీ స్వయంవరం (సి) ఆమ్రపాలి (డి) వసంతసేన

 

(8) 'అహనా పెళ్ళంట..' సినిమాకి మూలమైన నవల

(ఎ) పెళ్ళానికో ప్రేమలేఖ (బి) ప్రేమలు - పెళ్ళిళ్ళు (సి) సత్యంగారిల్లు (డి) ప్రేమిస్తే పెళ్ళవుతుందా?

 

(9) తండ్రీ కొడుకులు దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా

(ఎ) పల్నాటి యుద్ధం (బి) రోజులు మారాయి (సి) కురుక్షేత్రం (డి) లవకుశ

 

(10) ఇంగ్లీష్ సినిమా స్ఫూర్తితో నిర్మించి, ఇంగ్లీష్‌లోకి డబ్ చేయపడిన చిత్రం

(ఎ) మోసగాళ్ళకు మోసగాడు (బి) గూఢచారి 116 (సి) ఆమె ఎవరు? (డి) హంతకులు దేవాంతకులు

 

(11) ఆంధ్ర పత్రికలో రాబిన్ హుడ్ కథని పిల్లల సీరియల్‌గా వ్రాసిన సినీరచయిత

(ఎ) ముళ్ళపూడి వెంకట రమణ (బి) ఆరుద్ర (సి) వేటూరి సుందర్రామ్మూర్తి (డి) దాసం గోపాలకృష్ణ

 

(12) రీ రీ నక్సల్ బరీ.. బరీ బరీ ఫ్యుడల్ బరీ - అరుణ రణం, విప్లవం జ్వలనం జగం జాగృతం

(ఎ) వేటూరి సుందర్రామ్మూర్తి (బి) శ్రీశ్రీ (సి) సినారె (డి) గద్దర్

 

(13) నీ దోవ పొడవునా కువకువల స్వాగతం - నీ కాలి అలికిడికి మెలకువల వందనం

(ఎ) వేటూరి (బి) ఆత్రేయ, (సి) సిరివెన్నెల (డి) దేవులపల్లి

 

(14) కన్నెగానే  బతుకు గడిచిపోతుంది - నన్నెవరేలు కుంటారు అనుకున్నది

(ఎ) సినారె (బి) జాలాది (సి) ఆత్రేయ (డి) సముద్రాల

 

(15) వాగ్ధానం చిత్రంలో 'సీతారామకళ్యాణం ' హరికథ వ్రాసింది

(ఎ) సముద్రాల (బి) మల్లాది రామకృష్ణ శాస్త్రి (సి) దేవులపల్లి (డి) శ్రీశ్రీ

 

(16) కుచేలోపాఖ్యానం హరికథగా ఉన్న చిత్రం

(ఎ) కలెక్టర్ జానకి (బి) తాతామనవడు (సి) సంసారం - సాగరం (డి) బడిపంతులు

 

(17) 'అధిక చక్కని దొరగారు ' రాసినవారు

(ఎ) ఆరుద్ర (బి) దాశరధి (సి) ఆత్రేయ (డి) శ్రీశ్రీ

 

(18) వందేమాతర గీతం వరస మారుతున్నది

(ఎ) శ్రీశ్రీ (బి) సినారె (సి) జాలాది (డి) అదృష్టదీపక్

 

(19) నిద్దరొచ్చి తొంగుంటే కలనౌతాను, నిదురమాని మేల్కొంటే నిజమౌతాను

(ఎ) వేటూరి (బి) సినారె (సి) ఆత్రేయ (డి) కొసరాజు

 

(20) బ్యాంకులో డబ్బు దాచేవారు - నీ శక్తిని గమనించరువారు

(ఎ) శ్రీశ్రీ (బి) కొసరాజు (సి) ఆత్రేయ (డి) సినారె


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!