ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

  (1) కాకోలూకీయం - అనే అధ్యాయం ఏ గ్రంథం లోనిది?

(ఎ) మనుచరిత్ర (బి) పంచతంత్రం (సి) విక్రమార్క చరిత్ర (డి) నలదమయంతి చరిత్ర

 

(2) ఇతర భాషలలోని కధలను తెలుగులోకి అనువదింపచేసి వాటితోనే నడిచిన ప్రత్యేక మాసపత్రిక

(ఎ) చతుర (బి) విపుల (సి) స్వాతి (డి) ఆంధ్ర జనత

 

(3) 'జనప్రియ రామాయణం' రచయిత

(ఎ) పుట్టపర్తి (బి) విశ్వనాధ (సి) మల్లెమాల (డి) జనమంచి శేషాద్రి శర్మ

 

(4) కాళిదాసు రచించిన నాటకం 'అభిజ్ఞాన శాకుంతల'ను ఆంధ్రానువాదం చేసిన రచయిత

(ఎ)జాషువా (బి) కరుణశ్రీ (సి) కందుకూరి వీరేశలింగం (డి) దువ్వూరి రామిరెడ్డి

 

(5) ఇంగ్లీషులో 'స్కెచ్' అనబడే సాహిత్య ప్రక్రియను తెలుగులో ఇలా పిలుస్తారు.

(ఎ) కధానిక (బి) మినీకథ (సి) గల్పిక (డి) వ్యాసఖండిక

 

(6) దానము, భోగము, నాశము / పూనికతో మూడుగతులు భువి

(ఎ) సుమతీ శతకం (బి) దాశరధి శతకం (సి) నార్లవారి మాట (డి) భర్త్రు హరి శతకం.

 

(7) గరిమ తగ్గి నిజము మరుగున బడిపోవు \ తిరిగి తిరిగి ఋజువు బరపకున్న

(ఎ) జాషువా (బి) నీతిచంద్రిక (సి) భాగవతం (డి) నార్లవారి మాట

 

(8) మొట్టమొదటిసారిగా నవలల పోటీ ప్రకటించిన పత్రిక (వచన ప్రబంధం)

(ఎ) 1883 అముద్రిత గ్రంధం చింతామణి (బి) 1893 చింతామణి (సి) 1920 భారతి (డి) 1940 గృహలక్ష్మి

 

(9)  'ఆంధ్ర మహిళ' మాసపత్రిక స్థాపకులు

(ఎ) గుమ్మడిదల దుర్గాబాయమ్మ (బి) కనుపర్తి వరలక్ష్మి (సి) సూర్యదేవర రాజ్యలక్ష్మి (డి) మాలతీ చందూర్

 

(10) జావడము

(ఎ) పొట్టిగొర్రె (బి) పొట్టి యేనుగు (సి) పొట్టి గుర్రము (డి) పొట్టి తోడేలు

 

(11) మాధ్వీకము

(ఎ) ఇప్పపూవు కల్లు (బి) గులాబి రేక (12) బంతిపూవుపుప్పొడి (డి) వాన చినుకు.

(12) టిట్టిభము

(ఎ) భల్లూకము (బి) ముంగిస (సి) లకుమికపిట్ట (డి) డేగ

 

(13) యద్దనపూడి సులోచనరాణిగారు రచయిత్రిగా పనిచేసిన మొదటిసినిమా

(ఎ) చదువుకున్న అమ్మాయిలు (బి) ఆత్మ గౌరవం (సి) సెక్రటరీ (డి) విజేత

 

(14) ఒక కంట గతం జలపాతమైతే.. మరు కన్ను నవ్వదమ్మా

(ఎ) రక్తకన్నీరు (బి) కుంకుమరేఖ (సి) బొంబాయి (డి) రోజా

 

(15) కనకం కాసు విసిరేస్తే, ఆ కాసుకి ధర్మం లొంగదులే

(ఎ) సుందరకాండ (బి) ఇద్దరు (సి) గీతాంజలి (డి) కర్తవ్యం

 

(16) అడవిని పుట్టి పెరిగిన కథలే - అఖిల భారతికి హారతులు

(ఎ) అడవిదొంగ (బి) అడవిరాముడు (సి) ప్రతిఘటన (డి) యమగోల

 

(17) ఇరు సందెలు కదలాడే ఎద ఊయల వడిలో

(ఎ) గీతాంజలి (బి)శంకరాభరణం (సి) ప్రేమ (డి) రోజా

 

(18) అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం

(ఎ) ఆనందభైరవి (బి) ముద్దులకొడుకు (సి) శ్రీరంగ నీతులు (డి)కల్పన

 

(19) జాబిలి కన్నా నా చెలి మిన్న / పులకింతలకే పూచిన పొన్న

(ఎ) కాంచనగంగ (బి) చంటి (సి) ప్రేమయుద్ధం (డి) పంతులమ్మ

 

(20) దీపాలపండక్కి - దీపాలే కొండెక్కిపోయే

(ఎ) మాతృదేవోభవ (బి) సుందరకాండ (సి) ఈనాడు (డి) గోదావరి


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!