ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  (1) తెలుగులో మ్యూజింగ్స్ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన వారు

       (ఎ) శ్రీశ్రీ (బి)చలం  (సి) శ్రీ రంగం నారాయణబాబు (డి) లత
 

(2) 'పాతకొత్తల మేలు కలయక క్రొమ్మెరుంగులు జిమ్మగా' కవిత వెలయింతునని ప్రకటించినవారు.

      (ఎ) గురజాడ (బి) కందుకూరి (సి) దాశరధి (డి) నారాయరెడ్డి.
 

(3) స్వామీజీగా మారిపోయిన దిగంబరకవి

     (ఎ) నగ్నముని (బి) మహాస్వప్న (సి) భైరవయ్య (డి) సుగంబాబు
 

(4) 'కడిమిచెట్టు' నవలా రచయిత

      (ఎ) శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి (బి) కొడవటిగంటి కుటుంబరావు (సి) వెంకట పార్వతీశ్వర కవులు (డి) విశ్వనాథ సత్యనారాయణ
 

(5) 'విహీన' నవలా రచయిత్రి

     (ఎ) లత (బి) ముప్పాళ రంగనాయకమ్మ (సి) అట్లూరి హజరా (డి) సి. ఆనందారామం
 

(6) సుదీర్ఘకాలం నిరాటంకంగా నడిచిన/నడుస్తున్న తెలుగు పత్రిక

     (ఎ) ఆంధ్రజ్యోతి (బి) ఆంధ్రపత్రిక (సి) ఈనాడు (డి) విశాలాంధ్ర.
 

(7) మహిళల కోసం మహిళల చేత ప్రారంభించబడిన, మహిళా రచయితల రచనలనే ప్రచురించిన తొలి మాసపత్రిక

     (ఎ) అనసూయ (బి) శారద (సి) సుజరంజని (డి) హిమసుందరి
 

(8) మల్లాదిగారు సంపాదకత్వం వహించిన వారపత్రిక

     (ఎ) పల్లకి (బి) స్రవంతి (సి)మయూరి (డి) విజయ
 

(9) నేపథ్య గాయని జిక్కి అసలు పేరు

     (ఎ) టి. ఆర్.కె కృష్ణకుమారి (బి) కె.వి.కృష్ణ తేజ (సి) పి.జి.కృష్ణవేణి (డి) ఎస్.ఆర్. కృష్ణమణి
 

(10)  అలనాటి ప్రముఖ సినీనటి కన్నాంబ భర్త, సినీ దర్శకుడు

        (ఎ) కడారు నాగభూషణం (బి) గూడవల్లి రామబ్రహ్మం (సి) చిత్రపు నరసింహారావు (డి) పి.పుల్లయ్య.
 

(11) ఒలెంపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళ

      (ఎ) నీలంశెట్టి లక్ష్మి (బి) కరణం మల్లీశ్వరి (సి) వీరమాచనేని సరోజని (డి) తాపీ రాజమ్మ

 

(12) తొలి తెలుగు సీత

       (ఎ) అంజలీ దేవి (బి) కన్నాంబ (సి) దాసరి కోటి రత్నం (డి) సీనియర్ శ్రీరంజని

 

(13) తెలుగు సినిమారంగంలో తొలి మహిళా నిర్మాత

       (ఎ) దాసరి కోటి రత్నం (బి) ఆవేటి పూర్ణిమ (సి) కన్నాంబ (డి) సురభి కమలాబాయి

 

(14) సావిత్రి ఇంటి పేరుతో సహా సినిమా టైటిల్స్‌లో వచ్చిన ఒకే ఒక్క చిత్రం.

       (ఎ) దేవదాసు (బి) శాంతి (సి) కన్యాశుల్కం (డి) పెళ్ళిచేసి చూడు.

 

(15) తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో నటించిన నటీమణి

       (ఎ) సురభి కమలాబాయి (బి) సురభి వెంకటరత్నమ్మ (సి) సురభి కోటరత్నం (డి) సురభి సరళాదేవి

 

(16) 'రైతు నాగలి మోస్తున్నాడు - క్రీసు శిలువ మోసినట్లు'

       (ఎ) సినారె (బి) దాశరధి (సి) తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి (డి) శేషేంద్ర శర్మ

 

(17) 'అమెరికాలో మనుష్యులు బుర్ర కిందకీ, కాళ్ళు పైకీ పెట్టి నడుస్తారు'

        (ఎ) పానుగంటి లక్ష్మీ నరసింహారావు (బి) మందపాటి సత్యం (సి) గురజాడ (డి) విశ్వనాధ సత్యనారాయణ

 

(18) హెచ్చెను హింసా ద్వేషం - ఏమౌతుందీ దేశం

       (ఎ) పవిత్రబంధం (బి) అర్ధరాత్రి స్వతంత్రం (సి) భార్యాబిడ్డలు (డి) విప్లవశంఖం

 

(19) పారిజాత సుమదళాల పానుపూ - మనకు పరచినాడు  చెరకు వింటి వేలుపు

      (ఎ) వీరాంజనేయ (బి) కార్తవరాయుని కథ (సి) భువనసుందరి కథ (డి) వీరాభిమన్యు.

 

(20) చూడకపోతే దిగులు - నిను చూస్తే ఏమౌతానో

       (ఎ) ముద్దుబిడ్డ (బి) కన్నతల్లి (సి) పెంపుడు కొడుకు (డి) ఆత్మబంధువు 

 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!