ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

 

(1) ప్రథమ తెలుగు మహిళా న్యాయమూర్తి

(ఎ) జస్టిస్ తేజోమయి (బి) జస్టిస్ అమరేశ్వరి (సి) జస్టిస్ రమాదేవి (డి) జస్టిస్ మాధవి 

(2) తొలి మహిళా కాలమిస్ట్

(ఎ) లత (బి) కోడూరి కౌసల్యాదేవి (సి) మాలతీ చందూర్ (డి) మాదిరెడ్డి సులోచన. 

(3) గృహలక్ష్మి స్వర్ణ కంకణం స్థాపించినవారు, ప్రారంభించినవారు

(ఎ) భానుమతి (బి) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (సి) డా.కె.ఎన్.కేసరి (డి) బండారు అచ్చమాంబ 

(4) 'ధనత్రయోదశి' మొదట తెలుగు కథ అని ఒక ప్రతిపాదన. ఆ కథ వ్రాసినవారు.

(ఎ) గురజాడ అప్పారావు (బి) బండారు అచ్చమాంబ (సి) కందుకూరి వీరేశలింగం (డి) శ్రీ పాద కృష్ణమూర్తి  

(5) కందుకూరి వీరేశలింగంగారు నిరసించిన కవయిత్రి

(ఎ) ముద్దుపళని (బి) రంగాజమ్మ (సి) మధురవాణి (డి) కవయత్రి మొల్ల 

(6) గణితంలో గారడీలు, మెదడుకు పదునులాంటి పుస్తకాలలో గణిత సమస్యలను కథల రూపంలో అందించినవారు
(
ఎ) ఆరుద్ర (బి) టెంపోరావ్ (సి) మహీధర నళినీ మోహన్ (డి) తెన్నేటి సూరి 

(7) 'వోల్గా నుంచి గంగా వరకు' తెలుగు నవలకు మూలమైన బెంగాలీ నవల వ్రాసింది

(ఎ) రాహుల్ సాంకృత్యాయార్ (బి) వనఫూల్ (సి) రవీంద్రనాధ్ ఠాగోర్ (డి) ప్రేంచంద్  

(8) 'పావలా' నాటక రచయిత

(ఎ) గొల్లపూడి మారుతీరావు (బి) గణేష్ పాత్రో (సి) కొడాలి గోపాలరావు (డి) బాలాంత్రపు రజనీకాంతరావు 

(9) ప్రముఖ రచయిత్రి లత వ్రాసుకున్న జీవిత చరిత్ర పేరు

(ఎ) ఊహాగానం (బి) పథవిహీన (సి) గాలిపడగలు - నీటి బుడగలు (డి) ఇదే - నా జీవితం 

(10) ఋతుఘోష వ్రాసినవారు

(ఎ) దాశరధి (బి) సి.నా.రె (సి) గుంటూరు శేషేంద్రశర్మ (డి) జంధ్యాల పాపయ్య శాస్త్రి 

(11) ఆహో పురుషిక - అంటే అర్ధం (అహా పురుషిక)

(ఎ) బడాయి (బి) నింద (సి) అన్నవాహిక (డి) ఆడ - మగ  కలిసిన ఒక రాక్షసి 

(12) కూపారము

(ఎ) మట్టికుప్ప (బి) సముద్రము (సి) నదీపాయ (డి) ఒక పంట 

(13) జరదవము

(ఎ) ఒక జాతి పాము (బి) రుషికేష్ లోని ఒక ఆశ్రమం (సి) ముసలి ఎద్దు (డి) అష్టదిక్పాలకులలో ఒకరు. 

(14)ధమ్మిల్లము

(ఎ) రెల్లుపూవు (బి) భవంతిలోని పై భాగము (సి) కొప్పు, తల (డి) ఏటి మోగ 

(15) మరుత్వంతుడు

(ఎ) ఇంద్రుడు (బి) విష్ణువు (సి) గరుత్మంతుడు (డి) రావణాసురడి కుమారుడు 

(16) ఆకాశంలో హంసలమై - హాయిగ ఎగిరే జంటలమై అలా అలా కులాసాల తేలిపోదామా

(ఎ) గోవులగోపన్న (బి) మంచి కుటుంబం (సి) ఇద్దరు మిత్రులు (డి) కన్నెవయసు 

(17) నీ చేతుల వీణను నేనై పాటపాడనా - నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

(ఎ) బంగారుగాజులు (బి) శ్రీదేవి (సి) పునర్జన్మ (డి) వాగ్దానం 

(18) వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే సరస రాగమాధురిలో సకల జగము సాగునులే

(ఎ) మాతృదేవత (బి) ఆత్మీయులు (సి) అంతా మన మంచికే (డి) ఆరాధన 

(19) గాలిబ్ గీతాలను అనువదించిన కవి

(ఎ) దాశరధి (బి) ఆరుద్ర (సి) సినారె (డి) వేటూరి 

(20) తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి చింతా చీకటి ఒకటై చిన్న బోయే ఈ రేయి

(ఎ) డా.చక్రవర్తి (బి) పూలరంగడు (సి) రంగుల రాట్నం (డి) పూజ
 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!