ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

 

(1) విచిత్ర వినోద సాహసగాధలతో జక్కన వ్రాసిన కావ్యం

     (ఎ) స్వారోచిానుసంభవం (బి) విక్రమార్క చరిత్ర (సి) శ్రీ రంగరాజు చరిత్ర (డి) రాఘవ పాండవీయం 

(2) నిరంకుశోపాఖ్యానం రచయిత

     (ఎ) కళవెనంజరాజు (బి) కూచిమంచి తిమ్మ కవి (సి) కందుకూరి రుద్రకవి (డి) కంఠీరవ నరసరాజు 

(3)సహజ పండితుడు బిరుదాంకితుడు.

    (ఎ) నన్నెచోడుడు (బి) రఘునాధరాయులు (సి) గుర్రం జాషువా (డి) బమ్మెరపోతన 

(4) నిర్వచనోత్తర రామాయణం - రచయిత

      (ఎ) తిక్కన (బి) నన్నయభట్టు (సి) ధూర్జటి (డి) పాల్కురికి సోమాన 

(5) తెలుగులో తొలి రాజకవి

     (ఎ) శ్రీ కృష్ణ దేవరాయలు (బి) నన్నెచోడుడు (సి) రాజరాజ నరేంద్రుడు (డి) పాల్కురికి సోమన 

(6) శశికళ - ఎవరి ఊహా ప్రేయసి

      (ఎ) దాశరధి (బి) దేవులపల్లి (సి) అడవి బాపిరాజు (డి) రాయప్రోలు సుబ్బారావు 

(7) వెన్నెలలో పిల్లన గ్రోవి - నవలా రచయిత్రి

      (ఎ) కోడూరి కౌసల్యదేవు (బి) ఓల్గా) (సి)  మాదిరెడ్డి సులోచన (డి) కొలిపాక రమామణి 

(8) బ్రాహ్మణీకం - నవలా రచయిత

     (ఎ) కందుకూరి వీరేశలింగం (బి) చలం (సి) నాగభైరవ కోటేశ్వరరావు (డి) చిలకమర్తి లక్ష్మినరసింహం 

(9) ఎన్.ఆర్. నంది వ్రాసిన నవల

      (ఎ) నైమిశారణ్యం (బి) పాపికొండలు (సి) అంపశయ్య (డి) జీవితాదర్శం 

(10) రెండు రెళ్ళు ఆరు - నవలా రచయిత

       (ఎ) జంధ్యాల (బి) యండమూరి (సి) మల్లాది వెంకటకృష్ణ మూర్తి (డి) కొమ్మనాపల్లి గణపతిరావు

(11) ఉదయిని పత్రికా సంపాదకుడు - శ్రీ శ్రీ మితృడు

         (ఎ) చలం (బి) కొంపెల్ల జనార్ధనరావు (సి) శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి (డి) మల్లాది వెంకటరత్నం 

(12) తెలంగాణా నుంచీ వెలువడిన తొలి సాహిత్య పత్రిక

        (ఎ) హితబోధిని (బి) తెనుగు (సి) గోలుకొండ పత్రిక (డి) మహతి 

(13) మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు కొంతకాలం సంపాదకత్వం వహించిన వారపత్రిక

       (ఎ) పల్లకి (బి) హారిక (సి) స్రవంతి (డి) మంజూష 

(14) మహిళల నిర్వహణలో, మహిళల సంపాదకత్వంలో మహిళల సమస్యలకోసం వెలువడిన తొలి మాసపత్రిక

        (ఎ) భారతివనిత (బి) ఆంధ్ర మహిళ (సి) హిందూ సుందరి (డి) హిందూ బాలిక 

(15) కృష్ణాపత్రిక తొలినాళ్ళలో ఈ నగరనుంచీ వెలువడింది

       (ఎ) తెనాలి (బి) మచిలీపట్నం (సి) రాజమండ్రి (డి) విజయనగరం 

(16) కలవారినేకాని కరుణింపలేడా - నిరుపేద మొరలేవీ వినిపించుకోడా

        (ఎ) గోవులగోపన్న (బి) వెంకటేశ్వరమహత్యం (సి) పాండురంగ మహత్యం (డి) రంగులరాట్నం 

(17) అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది

       (ఎ) మంచి మనసులు (బి) మూగమనసులు (సి) తేనెమనసులు (డి) కన్నెమనసులు 

(18)  నల్లని నీ కురులలో తెలతెల్లని సిరిమల్లెనై పరిమళాలు చిలుకుతూనే పరవశించపోనా

       (ఎ) బంగారు గాజులు (బి) శ్రీదేవి (బి) బుద్దిమంతుడు (డి) ఇద్దరు మితృలు  

(19) అమ్మంటే అంతులేని సొమ్మురా - అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా

       () మట్టిలో మాణిక్యం (బి) అంతామనమంచికే (సి) బుల్లెమ్మా బుల్లోడు (డి) అమ్మరాజీనామా 

(20) సిగ్గుచాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది. పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది.

       (ఎ) అమాయకురాలు (బి) ఆత్మీయులు (సి) మంచి మనిషి (డి) బంగారుకలలు
 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!