ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)

అష్టకష్టాలులో లేనిది
(ఎ) దారిద్య్రం
(బి) అప్పుపడడం (సి) ఒంటరిగా నడవడం(డి) యుద్ధంలో దెబ్బలు తినడం

(2)

 అష్టదిగ్గజాల్లో ఒక ఏనుగు
(ఎ)
సుపత్రీకం (బి)సుప్రజం (సి) సుచరితం (డి)సుజననీయం

(3)

 సీతజడ కథా రచయిత
(ఎ) ముళ్ళపూడి వెంకటరమణ (బి) బాపు  
(సి) పురాణం సుబ్రహ్మణ్య శర్మ ( డి) ముప్పాళ్ళ రంగనాయకమ్మ

(4) 

 'జనప్రియ రామాయణం' వ్రాసిన కవి
(ఎ) మల్లెమాల
(బి) పుట్టపర్తి (సి) జనమంచి శేషాద్రిశర్మ (డి) కవయిత్రి మొల్ల

(5)

 'జో అచ్యుతానంద.... జోజో ముకుందా..' వ్రాసినది
(ఎ) శంకరంబాడి సుందరాచారి
(బి) అన్నమాచార్యులు (సి) త్యాగయ్య (డి) క్షేత్రయ్య

(6)

 'ఎరుగవేనన్ను లోకభీకర మహాగ్రఫణి విషస్ఫీత మృత్యురూపిణిగ నీవు’ - వ్రాసినది
(ఎ) శ్రీశ్రీ
(బి) దేవులపల్లి (సి) జాషువా (డి) విశ్వనాధ

(7)

 పంచకావ్యాలలో లేనిది
(ఎ) మనుచరిత్ర ( బి) ఆముక్తమాల్యద ( సి) వసుచరిత్ర ( డి) భగవద్గీత

(8)

త్యాగయ్య అసలు పేరు
(ఎ) కాకర్ల త్యాగరాజు
(బి) సుసర్ల త్యాగరాజశాస్త్రి (సి) సముద్రాల త్యాగరాజశర్మ (డి) త్యాగరాజ భాగవతార్

(9)

"పరమద్రోహివి నిన్ను పతితపానుడని - ప్రహ్లాదుడెటవలె తలచెనో' అని నిందించిన కవి
(ఎ) త్యాగయ్య
(బి) శ్యామశాస్త్రి ( సి) క్షేత్రయ్య( డి) రామదాసు.

(10)

బందరు నుంచీ వచ్చిన ప్రముఖ రంగస్థలనటుడు
(ఎ) షణ్ముఖ ఆంజనేయ రాజు( బి) డి.వి.సుబ్బారావు( సి) వేమూరి గగ్గయ్య( డి) బళ్ళారి రాఘవ

(11)

కల్యాణ చక్రవర్తి పాదపద్మాలకే తన నవలలన్నింటినీ అంకితం చేసిన రచయిత్రి
(ఎ) మాదిరెడ్డి సులోచన
(బి) అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి( సి) యద్దనపూడి సులోచనారాణి( డి) పోల్కంపల్లి శాంతాదేవి.

(12)

వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల గురించి 'గాలిపడగలు – నీటిబుడగలూ’ నవల వ్రాసిన రచయిత్రి
(ఎ) శివశంకరి( బి) తెన్నేటి హేమలత (సి) రంగనాయకమ్మ ( డి) వాసిరెడ్డి సీతాదేవి

(13)

 'ఈ యేటి కిద్దరొక్కటైతే - ముందటికి ముగ్గురౌతారే..' – ఈ పాట ఏ చిత్రంలోనిది?
(ఎ) మంచి మనసులు ( బి) మూగమనసులు( సి) రక్తసంబంధం( డి) భార్యాభర్తలు

(14)

అందమైన జీవితమూ – అద్దాల సౌధమూ - చిన్న రాయి విసిరినా చెదిరిపోవును - ఈ పాట ఏ చిత్రంలోనిది?
(ఎ) బంగారుబాబు(బి) దసరాబుల్లోడు( సి) ఆత్మబలం(డి) విచిత్రబంధం

(15)

సరిగమ పదనిని నీదానిని. సరిగా సాగని నీ దారిని  - ఈ పాట ఏ చిత్రంలోనిది?
(ఎ) స్వరకల్పన ( బి) లాయర్ సుహాసిని ( సి) స్వర్ణకమలం
( డి) స్వాతిముత్యం

(16)

వినయానికి నే విమలధాత్రిని - విమలశిల నిత్యాగ్నిహోత్రిని  - వ్రాసిందెవరు?
(ఎ) సినారె ( బి) సిరివెన్నెల ( సి)దేవులపల్లి (డి)వేటూరి

(17)

మనసున్న కనులుంటే ప్రతిచోటా మధుమాసంకనులున్న మనసుంటె బ్రతుకంతా మనకోసం- వ్రాసిందెవరు?(ఎ) ఆత్రేయ ( బి) వేటూరి( సి) సిరివెన్నెల (డి) సి.నా.రె

(18)

భుజిష్య – అంటే అర్థమేమిటి?
(ఎ) వేశ్య
(బి) పాము (సి) ముంగిస (డి) భోజనము

(19)

గ్లౌ(సంస్కృతం)
(ఎ) గాండీవము ( బి) చంద్రుడు ( సి) సూర్యుడు ( డి) రధము

(20)

ప్రేముడి
(ఎ)స్నేహము
(బి) విరోధము (సి) విద్వేషము (డి) అసూయ
 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!