ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  (1) "పాత కొత్తల మేలు కలయిక క్రమ్మెరుంగులు జిమ్మగా.." ఇది వ్రాసిందెవరు?

(ఎ) గిడుగు సీతాపతి (బి) కరుణశ్రీ (సి) జాషువా (డి) గురజాడ
 

(2) 'పెద్దబాలశిక్ష రచయిత

(ఎ) చిన్నయసూరి (బి) పుదూరు సీతారామశాస్త్రి (సి) గరిమెళ్ళ సత్యనారాయణ (డి) తెన్నేటి సూరి
 

(3) తెలుగులో స్వీయచరిత్ర రాసుకున్న మొట్టమొదటి సాహితీవేత్త

(ఎ) గురజాడ (బి) శ్రీపాద (సి) వీరేశలింగం (డి) ఆదిభట్ల నారాయణదాసు
 

(4) తెలుగులో మొట్టమొదటి యాత్రాస్మృతి - ట్రావ్‌లాగ్ వ్రాసిన వ్యక్తి

(ఎ) వావికొలను సుబ్బారావు (బి) ఏనుగుల వీరాస్వామయ్య (సి) ఆద్దేపల్లి లక్ష్మణ స్వామి (డి) పారుపల్లి సీతారామాంజనేయులు.
 

(5) శ్రీశ్రీ అసలు ఇంటిపేరు

(ఎ) శ్రీరంగం (బి) భాగవతుల (సి) పూడిపెద్ది (డి) అగ్నిహోత్రం
 

(6) చలం - గుడిపాటి వెంకటచలం అసలు ఇంటిపేరు

(ఎ) కొమ్మూరి (బి) కొడవటిగంటి (సి) కొత్తవలస) (డి) కొంగర
 

(7) విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు రచయిత

(ఎ) కరుణశ్రీ (బి) మొక్కపాటి నరసింహశాస్త్రి (సి) విశ్వనాధ సత్యన్నారాయణ (డి) కొడవటిగంటి కుటుంబరావు.
 

(8) నాయీ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను –అన్నదెవరు?

(ఎ) పఠాభి (బి) శ్రీశ్రీ (సి) సినారె (డి) రంగనాయకమ్మ
 

(9) బండారు అచ్చమాంబ సోదరుడు

(ఎ) బండారు రంగనాధస్వామి (బి) అద్దేపల్లి హనుమంతరావు (సి) కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (డి) అక్కిరాజు సత్యమూర్తి
 

(10)  దేవులపల్లి గారు “కృష్ణపక్షం” వ్రాసిన సంవత్సరం

(ఎ) 1915 (బి) 1925 (సి) 1930 (డి) 1940
 

(11) హిందూ దేవతలకి చిత్రరూపం ఇచ్చిన చిత్రకారుడు

(ఎ) దామెర్ల రామారావు (బి) విశ్వపతి (సి) రవివర్మ (డి) రవీంద్రనాథ్ టాగోర్.
 

(12) నిగనిగపై మెరుగుల వెల / వగలాడిన బోలె నీవు పాపపుటెదతో / జగమెల్ల మోసపుత్తువు / సిగిరెట్టూ, నిన్ను బూది చేయుట తగదా? – అన్నదెవరు?

(ఎ) ఆరుద్ర (బి) శ్రీ శ్రీ (సి) తాపీధర్మారావు (డి) పఠాబి
 

(13) పదవోయి తెలుగువాడా / అదే నీ తెలుగు మేడా / సంకెళ్ళులేని నేల సంతోషచంద్రశాల – అన్నదెవరు?

(ఎ) సినారె (బి) రాయప్రోలు (సి) కరుణశ్రీ (డి) శ్రీశ్రీ
 

(14) సిగలో నెలవంక / మెడలో నాగరాజు / ఆ రేడు నావాడు / సరి రారువేరెవరూ

(ఎ) సినారె - భక్తకన్నప్ప (బి) వేటూరి - దక్షయజ్ఞం (సి) కొసరాజు - మూగమనసులు (డి) ఆరుద్ర - శివరాత్రి మహాత్యం
 

(15) బ్రతుకులోని బంధమా / పలుకలేని భావమా / మరువలేని స్నేహమా / మరలిరాని నేస్తమా

(ఎ) మల్లీశ్వరి (బి) బలిపీఠం (సి) జగదేకవీరుడు అతిలోకసుందరి (డి) ఛాలెంజ్
 

(16) ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే (శ్రీ శ్రీ) – గేయం ఏ చిత్రంలో వినిపించింది?

(ఎ) కన్యాశుల్కం (బి) కాలచక్రం (సి ఆకలిరాజ్యం (డి) మహాప్రస్థానం

 
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!