ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)'అడబాల'
(
ఎ) అడవిలో గోవుల్ని మేపేవాడు (బి) ఆడవారికి దుస్తులుకుట్టేవాడు (సి) ఎక్కడికి వెళ్తే అక్కడుండిపోయేవాడు (డి) వంటలు చేసేవాడు
 

(2) ఊళిక
(
ఎ) ఈలవేసే సాధనం (బి) నక్క అరుపు (సి) పల్లకి (డి) రంధ్రము
 

(3) సుధన్యుడు
(
ఎ) కౌరవులలో 50వ వాడు (బి) ధనవంతుడు (సి) ఆదిశేషుడు (డి) రైతు
 

(4) బేల్దారి
(
ఎ) తాపీపనివాడు (బి) తోటమాలి (సి) బాటసారి (డి) వ్యాపారి
 

(5) ఆదిత్యభక్త
(
ఎ) సూర్యకిరణం (బి)పొద్దు తిరుగుడు మొక్క (సి) తూర్పుదిక్కు (డి) నీరెండ
 

(6) భరాగో
(
ఎ) భజనపురి రామగోఖలే (బి) భమిడిపాటి రామగోపాలం (సి) భక్తరాజగోపురం (డి) బబ్రువాహన రాజాస్థాన గోవిందుడు
 

(7) పురాణపండ సూర్య ప్రకాశదీక్షితులు
(
ఎ) కరుణశ్రీ (బి) మంజుశ్రీ (సి) ఉషశ్రీ (డి) రాజశ్రీ
 

(8) వావిళ్ళ రామస్వామి శాస్త్రులు
(
ఎ) మద్రాసు పుస్తక ప్రచురణ కర్తలు (బి) రాజమండ్రిలో వంటవారు (సి) కాకినాడ పురోహితులు (డి) పిఠాపురం ఆస్థాన కవులు.
 

(9) అనిసెట్టి - పినిసెట్టి
(
ఎ) అప్పారావు, వీరభద్రం (బి) సుబ్బారావు, సూర్యారావు (సి) సుబ్బారావు, శ్రీరామ్మూర్తి (డి) సుబ్బారావు, గోవిందరాజు
 

(10) కొయ్యబొమ్మలు మెచ్చుకళ్ళకు - కోమలుల సారెక్కునా?
(
ఎ) చలం  (బి) లత (సి) కరుణశ్రీ (డి) గురజాడ
 

(11)ఒకానొక గాడిద ఆత్మకథ
(
ఎ) కిషన్ చందర్ (బి) ప్రేంచంద్  (సి) టాగోర్ (డి) శరత్
 

(12) 'కొల్లాయి గట్టితేనేమి'  నవల
(
ఎ) అభినవగాంధీ (బి) అడవి బాపిరాజు (సి) దాశరధి రంగాచార్య (డి) మహీధర రామమోహనరావు
 

(13) పులుల సత్యాగ్రహం - నవల
(
ఎ) విశ్వనాధ సత్యన్నారాయణ (బి) ఉషశ్రీ (సి) చలం (డి) గోపీచంద్
 

(14) నన్నిడిచి నువ్వెళితే - నీ వెంట నేనుంటా
(
ఎ) ఆత్మబలం, ఆత్రేయ, (బి) ఆత్మబంధువు, ఆరుద్ర (సి) ఆస్థిపరులు, దాశరధి (డి) అంతస్థులు, సినారె.
 

(15) బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తెలుసుకో -  గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో
(
ఎ) అందెశ్రీ (బి) గోరేటి వెంకన్న (సి) జలాది (డి) గద్దర్
 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!