సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 

పాడవే కోయిలా

ఆ: పాడవే కోయిలా పెళ్ళి సన్నాయిలా
          అ: ఊగవే ఊహల పల్లకి ఊయలా

ఆ: ప్రేమ ప్రియభావనా నెమ్మదిగ తాకెనా

అ: ప్రియమైన కబురు విని పద పద పదమని ఎగసిపడిన ఎదలో

     రవళించనీ చెలి అందెలో రస రంజనీ

ఆ: వివరించనీ చిరునవ్వులో నవకాంతినీ ||పాడవే||

1. ఆ: ఆమని వనమై విరిసింది

           ప్రతి అణువు సిరి చిగురు తొడిగి శ్రీరాముని వధువై మెరిసింది

           ఇది శుభ తరుణం అరుదైన క్షణం ఇది ఎవరి వరం

అ: కాముని శరమై తగిలింది

    చెలి మరుల విరుల వల కలికి కలల గజగామిని వలపై బిగిసింది

    ఇక ప్రతి నిముషం ప్రియురాలి వశం ఇది సతి సరసం

ఆ: తనువును మనసును తన ఒడిలో నివేదించనా

అ: తరగని ఋణమని తన జతలో తలే ఒంచనా

ఆ: అందుమా అందమా అని అడిగిన కౌగిలిలో కుసుమించనీ వికసించనీ మధు మంజరీ

అ: మురిపించనీ కరిగించనీ చెలి కంచెనీ      ||పాడవే||

2. ఆ: తెమ్మని మదినే కదిపింది

        ఇది వరకు ఎపుడు ఎదురవని వెలుగు ఎద రమ్మని నిజమై నిలిచింది

        ఈ రవికిరణం తగిలిన తరుణం రగిలిన పరువం

అ: కమ్మని స్వరమై పిలిచింది

    మనసులికి ఉలికిపడి వెతుకుతుంటె జత కమ్మని చెలిమే అడిగింది

ఆ: మనవి విని మతి చెదరడమే కద మగ సుగుణం

ఆ: అటు ఇటు తరిమిన తొందరలో ఎలా నిలువను

అ: అలజడి పెరిగిన ఎద సడిని ఎలా ఆపను.

ఆ: అల్లుకో నేస్తమా అని పిలిచిన మధురిమలో

    శృతిమించనీ జతపంచనీ ప్రియగీతిని

ఆ: కదిలించనీ నిదురించిన చెలి ఆశని

(చిత్రం: వీడెక్కడి మొగుడండీ!. సంగీతం: కోటి, గానం: శ్రీరాఁ ప్రభు, రాధిక)

 

చెమ్మచెక్క చెమ్మచెక్క

 

|| అ: చెమ్మచెక్క చెమ్మచెక్క చేమమంతులోయ్

         చెంపచుక్క చెంపచుక్క సంపెంగలోయ్

ఆ: కన్నెబుగ్గ కన్నెబుగ్గ కవ్వింతలోయ్

     సిగ్గుమొగ్గ సిగ్గుమొగ్గ తుళ్ళింతలోయ్

అ: సరదాల సంగీతంలో చెలరేగింది సన్నాయి

     బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి పెళ్ళి సందళ్ళలో    ||చెమ్మచెక్క||

||1.ఆ: ఊరువాడ వచ్చి ఈడుజోడు మెచ్చి

           సంబరంగ చూస్తారంట

అ: కన్నవారు వచ్చి కన్నెదానమిచ్చి

     కంటనీరు పెడతారంట

     తడికళ్ళే ప్రమిదెలుగా వెలిగే పందిరిలోన

     పరవళ్ళే అందెలుగా ఆడే ఆనందాన

ఆ: పిట్టకూడ పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ

అ: పిల్లగాలి పెళ్ళి పెద్దయింది పన్నీరు చల్లిస్తూ పెళ్ళిసందళ్ళలో     ||చెమ్మచెక్క||

 

2. ఆ: పట్టుచీర కట్టి పూలజడ కుట్టి

        కొత్తకళ మురిసే వేళ

ఆ: వానవిల్లువంటి జాణవన్నెలాంటి

    వేయికళ్ళు మెరిసే వేళ

 అ: నిలువెల్లా మెరిసింది పులకింతల పుదోట

        విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట

        ఆడజన్మ మేలుకొంది చూడు సరికొత్త రూపంతో

        అంగరంగ వైభవంగా నేడు జరిపించు వేడుకతో పెళ్ళి సందళ్ళలో      ||చెమ్మచెక్క||

 

(చిత్రం: ఆజాద్; సంగీతం: మణిశర్మ, గానం: బాలు, చిత్ర, సుజాత)

 

 

 

 
 

 

 (కొనసాగింపు వచ్చేసంచికలో)