ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 సిరివెన్నెల గారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

(2)
కష్టం వస్తేనే గద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది

(3)
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం

(4)
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు

(5)
పిల్ల వయ్యారాలు తూగుటూయ్యాలెక్కి
ఊగుతున్నాయమ్మా గారబంగా!
(6)
 అలకలొచ్చిన కలికి
ఏసినాది కులుకుల మొలికి
(7)
నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
(8)
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశలవాహిని
(9)
కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువ్వు తెల్లబోదువే నీలాల గగనమా!
(10)
కరిగిపోని నా తీపికలలని
తిరిగిరాని నా చిన్నతనముని - నీ రూపములో చూస్తూ ఉన్నా
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!