ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 మల్లాది రామకృష్ణశాస్త్రి గారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
నాదసాధనలే దేవికి పూజ
తరళ తానములె హారములౌ

(2)
తరుణలందరు దధి చిలికే వేళాయె

(3)
తనవారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలసేరులే..!

(4)
ఏరుమీద ఊరు ఊరు మీద ఏరు
ఏరు మయాన పాలేరు

(5)
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
(6)
జోకు జోకు చూపులూ.. చూపులోనే బ్రేకులూ.
(7)
అవలీలగ జగమేలగ నవచైతన్య
సమ్మోహ సమ్మేళన నేనే!
(8)
సడిలేని నడిరేయిగా జవరాల మనమౌదమే
(9)
ఇల్లుదీసి పందిరేసి పకపక లాడితే
పిల్లలున్న లోగిలని దేవుడే మెచ్చేను
(10)
చెలువారు మోమున లేలేత నగవున
కలహంస గమనాన కలికీ ఎక్కడికీ!
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!