ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

ఆరుద్ర గారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
ఆడిన ఆటలు నోములయి
కోరిన పెనిమిటి దొరకవలె

(2)
పాశుపతం కోరెను పార్థుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు

(3)
నదులన్ని కలవాలి కడలిలోనె
ఎదవుంటె కరగాలి వలపులోనె

(4)
నిదురలో పాపాయి పలవింతలు - అవి
ఎదలోన తల్లికి పులకింతలు

(5)
నీ పెదవి ముందు బలాదూరు పగడాలు
నీ కురుల ముందు దిగదుడుపు నీలాలు
(6)
జోకు జోకు చూపులూ.. చూపులోనే బ్రేకులూ.
(7)
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా!
(8)
నిండుజాబిలి కదా నెలత జానకి వదనము
పండు వెన్నెలవాడ పడతి శ్రీ సదనము
(9)
తండ్రిమాట దాటలేని రాముడైనను
ఆలితో అడవులందు హాయి పొందెను..
(10)
సోలి తడబడి ఎడద - ఊయాలూగేను
పడతి! కాంతుని భుజము పానుపయ్యేను..!
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!