సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 

నిన్నేపెళ్ళాడేస్తానంటూ

అబ్బాయి ఎవర్నైనా ప్రేమించి ప్రొసీడ్ అయిపోతూ ఉంటే, అతని సెలక్షన్ తమకు కూడా నచ్చిన తల్లితండ్రులు, బంధువులు, అబ్బాయి పెళ్ళికూతుర్ని తమకు తెలియకుండా ఎంపిక చేసుకున్నాడని చిన్న అలక ప్రదర్శించినా, తమక్కూడా నచ్చిన పిల్లే కాబట్టి ఒప్పేసుకునే సందర్భం. పిల్లా పెద్దా అందరూ ఫ్రీగా, సరదాగా మాట్లాడుకునే వాతావరణం గల ఆధునిక కుటుంబం. ఆ సందర్భాన్ని పాటలో బంధించిన తీరు చూడండి.

  
|| నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
     సరేరా కుమారా అలాగే కానీరా
     మా కళ్ళల్లో కారం కొట్టి
 మీరు మాత్రం జారుకుంటారా
    సెలక్షన్ చూశాం శభాష్ అంటున్నాం
    ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించి పోతాం
    ఆపై మాతో మీకేం పనిరా మాయమై పోతాం లేరా
    సరేరా కుమారా అలాగే కానీరా
   నిన్నే పెళ్ళాడేస్తానంటూ
 మాట ఇచ్చావా పాపం

 

|| 1.ప్రేమ దాకా ఓకే..పెళ్ళి మాత్రం షాకే
       చాలురా నారదా నీ హరికథా..పెళ్ళయే యోగమే నీకున్నదా
       ఇంటిలో ఇందరం ఉన్నాం కదా కోరితే సాయమే చేస్తాం కదా
       పార్కులో సీను తప్పురా శ్రీనూ
       అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటారా కుర్రాళ్ళు
       ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే
 మేము మాత్రం కాదంటామా
        సరేరా కుమారా అలాగే కానీరా     
||నిన్నే పెళ్ళాడేస్తానంటూ||

 
2.     సిగ్గు పడవే పండూ.! నువ్వు కాదురా..ఫ్రెండూ
       ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
        విందులు మెక్కుతూ వంకలు పెడతాం

       చీటికీ మాటికీ చెలరేగుతాం అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
       పెళ్ళి కాగానే అందరినీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి
      ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ
  మేలుకుంటాం మీకు పోటీగా ||నిన్నే పెళ్ళాడేస్తానంటూ|| 
 (చిత్రం: నిన్నేపెళ్ళాడుతా!; సంగీతం: సందీప్ చౌతా; గానం: జిక్కి. ఇ.ఎస్.మూర్తి & కో)

 

కోటలోని రాణి

 

|| కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్ళిచేసుకుంటానంటావా
              మేడలలో దొరసాని మావాడ చూస్తావా

కో|| గాలికూడరాని గల్లీలోనే కాపురముంటానంటావా
               పేదల బస్తీలోనే నీ గూడు కడతావా

ఆ: ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి
               ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా      
 ||కోటలోని||

 

|| 1. అ:ఎపుడూ నీపైన పడదే చినుకైనా గొడుగై ఉంటాగా నేనే నీతో

ఆ:         ఇకపై ఎవరైనా వెతకాలనుకున్నా కొలువై ఉంటాలే నేనే నీలో

అ:         నూరేళ్ళపాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా

ఆ:         డాక్‌టేరు కాడు ఇంజనీరు కాడు ఊరూపేరూ లేనోడూ

            ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు

అ:        మొండి సచ్చినోడు , కొండముచ్చుగాడు

           నిన్నెట్టా సుఖపెడతాడు భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు

ఆ:       ఇష్టమైనోడె ఈశ్వరుడు మనసుపడినోడె మాధవుడు

          ప్రేమ పుట్టాక పిచ్చిపట్టాక ఆశ ఆగదుకదా        ||కోటలోని||

 

2.ఆ: నగలే కావాలా వగలే వెలిగేలా ఒక్కో ముద్దు తాకేవేళ

అ:    సిరులే ఈవేళ మెడలో వరమాల మహరాజంటే నేనే కాదా

ఆ:    ఏదో సంతోషం ఏదో ఉత్సాహం వేరే జన్మే ఇదా

అ:    సుత్తుగిన్నెలోని సద్దిబువ్వతోనె సద్దుకుపోగలనంటావా

       అపుడపుడూ పస్తుంటూ అలవాటు పడగలవా

ఆ:   నగలే కావాలా వగలే వెలిగేలా ఒక్కో ముద్దు తాకేవేళ

అ:   సిరులే ఈవేళ మెడలో వరమాల మహరాజంటే నేనేకాదా

ఆ:   ఏదో సంతోషం ఏదో ఉత్సాహం వేరే జన్మే ఇదా

అ:   సత్తుగిన్నెలోని సద్దిబువ్వతోనె సద్దుకుపోగలనంటావా

      అపుడపుడూ పస్తుంటూ అలవాటు పడగలవా

ఆ:   ఉప్పు ఎక్కువైనా గొడ్డుకారమైనా ఆహా! ఓహో! అనగలవా

      ఉక్కిరిబిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా

ఆ: పంచదారంటి మమకారం పంచెపెడుతుంటె సంసారం

    పచ్చిమిరపై పాయసం కన్న తీయగా ఉండదా    ||కోటలోని||

 

(చిత్రం: ఈశ్వర్; సంగీతం: ఆర్.పి. పట్నాయక్; గానం: రాజేష్, ఉష, కౌసల్య, నిహాల్, లెనినా)

 (కొనసాగింపు వచ్చేసంచికలో)