ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 సముద్రాలగారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
అవని జాతను జనక భూపతి
రవికులేశుని రాణిచేసెను..!

(2)
నిన్నే నమ్మీ నీపద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా..!

(3)
సురవరులూ సరాగాల చెలులా కలసీ సొలసే అనురాగసీమా..

(4)
ఆ సుందరి నెర నీటూ
నీ గోటికి సమమౌనా!

(5)
రఘుకులేశుడే ధర్మము వీడి
మరో భామతో కూడిననాడూ..
(6)
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళ!
(7)
మరుని శరాన తెలివి మాలీ
పరువుపోనాడి చేరగరాకు
(8)
నీదరి నున్నా తొలగు భయాలూ!
నీ దయలున్నా కలుగు జయాలూ.!!
(9)
బతుకంతా పలుప్రశ్నల మయమై బ్రతుకును జనసముదాయం
(10)
సిగ్గువదిలి ఇరుచేతులు జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!