సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 కుందనపు బొమ్మకి

 

 ఒకసారి ఇక ఇంటర్వ్యూలో శాస్త్రిగారన్నారు: శృంగారానికీ, బూతుకీ తేడా తెలుసుకోలేని పరిస్థితుకి చేరుతున్నాం మనం. శృంగారం ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ముఖ్యమైన అంశం, ప్రతి వ్యక్తినీ స్పందింపజేసే రసము. అయితే శృంగారం అనేది మనస్సు ఆధారంగా ఉండే భావన. శారీరికమైనది కాదు. యువతీ, యువకుల మధ్య ఉండే శృంగార భావనలను వర్ణించడానికి 'వల్గారిటీ'ని ఆశ్రయించడం కవిలోని భావదరిద్ర్యాన్ని సూచిస్తుంది' అని. 'వల్గారిటీ' జోలికి వెళ్ళవలసిన అగత్యం లేకుండా మనసుకు చక్కిలిగింతలు పెట్టేపాటలెన్నో వ్రాసారాయన.
ప్రేమికులు వివాహబంధంలో ముడిపడే వేళ వారి మనోభావాలు ఎలా ఉంటాయి. ఒకరికోసం ఒకరవుదాం అనే ప్రమాణాన్ని స్వచ్చందంగా వారెలా చేసుకుంటారు? అనే విషయాన్ని వెల్లడి చేసే ఈ పాటలు చూద్దామా!
 

చిన్ననాటి రెండుజెళ్ళ


ప|| చిన్ననాటి రెండుజెళ్ళ ఆ పెళ్ళికూతురు
అచ్చమైన ఆడపిల్ల అయ్యింది ఇప్పుడు
ఏ పిల్లగాలి వీస్తున్నా ఏ మల్లెతీగ చూస్తున్నా
ఆ బుంగమూతి చాటు నవ్వేమో అని
అనిపించదా అపురూపమైన ఆనవాలు ||చిన్ననాటి||

చ||1 తనే నవ్వుతుంటె తీయగా అటే చూస్తూవుంటా హాయిగా
పెదవి తెరిచి అడగకుండా తెలుసుకోనా కోరిక
ఆమె కోసం ప్రాణమైనా ఇవ్వలేనా కానుక
మదిలో మాటరాసి కబురే అందజేసే
శుభలేఖ పంపుతోంది నా శ్వాస ||చిన్ననాటి||

2. తలంబ్రాలు పోసే వేడుక పిలుస్తోంది నన్నే ప్రేమగా
తలచుకుంటే ప్రానమంతా పాడుతోంది కొంటెగా
నిజమయిందా అంతకన్నా ఏమివుంది పండగ
మెరిసే తాళినౌతా మెడలో వాలిపోతే
మహారాణినేలు రాజునేనౌతా ||చిన్ననాటి||

చిన్ననాటి రెండుజెళ్ళ ఆ పెళ్ళికూతురు
అచ్చమైన ఆడపిల్ల అయ్యింది ఇప్పుడు
ఏ గువ్వపాట వింటున్నా ఏ మువ్వ ఘల్లుమంటున్నా
ఆ బుంగమూతి చాటు నవ్వేమో అని అనిపించదా అపురూపమైన ఆనవాలు ||చిన్ననాటి||

(చిత్రం: చూసొద్దాం రండి; సంగీతం: యం.యం కీరవాణి, గానం. బాలు.)

                                ****

                గుండె గూటికి పండుగొచ్చింది


ప|| గుండెగూటికి పండుగొచ్చింది
పండువెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది ||గుండె||

చ||1 అ: నేల నొదిలిన గాలి పరుగున
ఆ: ఊరంతా చుట్టాలి
అ: వేళ తెలియక వేయి పనులను
ఆ: వేగంగా చెయ్యాలి
అ: నా ఇంటి గడపకి మింటి మెరుపుల
ఆ: తోరణమే కట్టాలి
అ: కొంటె కలలతో జంట చిలకకి
ఆ: స్వాగతమే చెప్పాలి
అ: ఎన్నెన్నో.... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది.
ఆ: ఏ పనీ తోచక తికమక పెడుతుంది

2. అ: బావ మమతల భావ కవాలి
ఆ: శుభలేఖలు కావాలి
అ: బ్రహ్మ కలిపిన జన్మ ముడులకు
ఆ: సుముహూర్తం రావాలి
అ: మా ఏడు అడుగుల జోడు నడకలు
ఆ: ఊరంతా చూడాలి
అ: వేలువిడువని తోడు ఇమ్మని
ఆ: అక్షింతలు వేయాలి
అ: ఇన్నాళ్ళు...ఇన్నాళ్ళు ఎదురుచూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకువచ్చే కళకళ కనబడగా || "గుండె"


(చిత్రం: ఎగిరేపావురమా, సంగీతం: యస్.వి కృష్ణారెడ్డి, గానం: ఉన్నికృష్ణన్, సునీత)
 

 

 (కొనసాగింపు వచ్చేసంచికలో)