ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 ఆత్రేయగారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
నిను నేను చూడగానే నేను లేను నాలోనా
నన్ను నేనే పెంచుకున్నా నీకు తెలియక నీలోనా

(2)
మాటలకున్నది అర్థం
అవి కుప్పగ పోస్తే వ్యర్థం

(3)
మహాత్ములెందరో సహాయపడినా మంచి జరుగలేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతుకలేదు

(4)
సంతాన మూలికలం
సంసార బానిసలం

(5)
ఏ స్వరము నీలో మెదిలి నా పదము పలికిందో
ఏ సొగసు నీలో మెరిసి నా శ్రుతిని తెలిపిందో..
(6)
తనకు కన్ను నీవైతే
నీకు రెప్ప తానౌతుంది..!
(7)
ఏ ఆడపిల్లా కాదీడ పిల్ల
ఏనాటికైనా అది ఆడపిల్ల
(8)
ఆకాశమల్లే నీ వున్నావు
నీ నీలిరంగై నేనున్నాను..!
(9)
కాలాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో..
(10)
ఇదసమర్థుని జీవయాత్ర
ముక్కలు చెక్కలుగా మూల్గుతున్న ప్రేమపాత్ర..!
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!