సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

నేను....శాస్త్రిగారు... పాట బంధం... 

నేను చదువుకుంటున్న రోజులవి. సినిమాలంటే పిచ్చ. వచ్చే సినిమాలన్నీ చూడ్డమే పని. ఆ రోజుల్లో సడన్‍గా  ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం' పాట ఏదో డిఫరెంట్‌గా, ఫ్రెష్‌గా వినిపించింది. దాంతో వేటూరిగార్ని ఫాలో అవడం. అటువంటి పాటలు, శంకరాభరణంలో పాటలు రాసిన ఆయనే 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను ' లాంటివి, ఇంకా స్పైసీ పాటలు రాయడం చూసి చాలా గమ్మత్తుగా ఉండేది.

మళ్ళీ మరో జర్క్. కాలేజీ డేస్‌లో 'సిరివెన్నెల' సినిమా కెళ్ళాను. విశ్వనాథ్ గారు తీసిన సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చింది. ఎందుకిలా? సరే చూద్దాం అని వెళ్ళాను. అప్పటివరకు ఆ సినిమాలో పాటలు కూడా విన్లేదు. 'ఆది భిక్షువు వాడినేమి కోరేది.. బూడిదిచ్చే వాడినేమి అడిగేది ' అనే పాట విని 'అరె! బాగా రాశారే.. శివుణ్ణి ఫస్ట్ బెగ్గర్ అన్నారు. ఎవరండీ ఈయన ' అనుకున్నాను. తరువాత తెలిసింది సీతారామశాస్త్రిగారని, ఓ కొత్తకవి  విశ్వనాథ్‌గారు పరిచయం చేస్తున్నారు అని. సరే!! సిరివెన్నెల క్యాసెట్ కొనుక్కుని మొత్తం పాటలన్నీ విన్నాను. నాకు మొదట్నుంచీ పాటలంటే ఇష్టం. ఎక్కువగా హిందీ పాటలు వింటూండే వాణ్ణి 'ఈ గాలి... ఈ నేల, 'బృందావనం ' పాట ఒక గుడ్డివాడు ఒక గుడ్డి అమ్మాయికి వెన్నెల్లో బృందావనం అందాల్ని చూపించడం అనే కాన్సెప్ట్. ఆ పాట మనసుని ఎటో తీసుకెళ్ళిపోవడం ఆ పాటలు చాలా కాలం నన్ను వెంటాడాయి. పాటలని నేను మళ్ళీ మళ్ళీ అనుకోవడం కాదు. పాటలే నన్ను వదలకుండా వెంటాడడం.

తర్వాత సినీ ఫీల్డులోకి రావడం, రాముగారి దగ్గర 'శివ' సినిమాకి అసిస్టెంటు డైరెక్టరుగా చేరడం అక్కడే మొదటిసారి శాస్త్రి గారిని చూడ్డం. పెన్ను, కాగితం పట్టుకుని శాస్త్రిగారి దగ్గర పాట కోసం ఆయన చుట్టూ తిరగడం ఆయన పాట రాసిస్తే దాన్ని 'ఫెయిర్' చేసుకోవడమే నా పని.

అప్పుడే శాస్త్రిగారి దగ్గర 'విరించినై విరచించితిని' అనే పాటకి ఆ పాట విన్నప్పుడు 'ఫొనెటిక్' గా చాలా బావుంది. కానీ మరి అర్ధం రచించడం అంటే తెలుసు. ఈ 'విరచించడం' ఏమిటి? తెలిసేది కాదు. ఆయన దగ్గరే అర్ధం  తెలుసుకోవడం.

రాముగారికి శాస్త్రిగారంటే విపరీతమైన గౌరవం ఉండడం. వాళ్ళిద్దరి మధ్య 'హాట్ హాట్ 'గా అనేక విషయాల మీద చర్చలు జర్గుతుండడం చూసి, ఈయనకి పాటలు రాయడమే కాక, చాలా విషయాలు తెలుసు అనిపించడం శాస్త్రిగారితో నా ప్రయాణం కంటిన్యూ అవడానికి కారణమయ్యాయి అనుకుంటున్నాను.

నేనుగా డైరక్షన్ మొదలు పెట్టాక సాంగ్ అంటే శాస్త్రిగారు తప్ప మరో ఆలోచనే లేకపోవడం అన్ని రకాల పాటల్ని ఆయనతోటే రాయించుకోడానికి నేను ప్రిఫర్ చెయ్యడం. నేను అనుకున్నట్టుగా పాట సిట్యుయేషన్స్ గాని, నా సినిమాలోని సోల్ గానీ ఆయన పాటలలో రిఫ్లెక్ట్ అవడం. ఆయన మీదుండే గౌరవం తోటీ ఆయన డెఫినెట్‌గా జడ్జ్ చెయ్యగలరనీ, పాటల కోసమే కాకుండా ప్రతి సినిమాకి ముందు ఆయనకు కథ చెప్పడం, ఆయన అభిప్రాయం తీసుకుని, ఆ అభిప్రాయాన్ని పాటించగలిగినా లేకపోయినా, అది సెకండరి విషయం. అభిప్రాయం  తీసుకోవడం, తర్వాత ఆయనతో దెబ్బలాడటం అలవాటైపోయింది.

నేను ఏ సినిమా చేసినా, వచ్చి ఆయనతో కూచుని, కథ చెప్పి దానిమీద కొట్టుకోవడం, తర్వాత సాంగ్ సిట్యుయేషన్‌లో దిగుతూ ఉండటం.  ఇప్పటివరకూ నా అన్ని సినిమాల్లో ఆయనకు కుదరకపోవడం వల్లో, ఎప్పుడైనా బయటి ఊరికేదైనా వెళ్ళిపోవడం వల్లో, వేరే పనుల మీద బిజీగా ఉండడం వల్లో, ఒకటి, అరా పాటలు వేరే వాళ్ళతో రాయించుకున్నాను గానీ 100% శాస్త్రిగారితోటి రాయించుకుందుకు  ఇష్టపడతాను. ఎందుకంటే నేను అనుకున్న కాన్సెప్ట్, క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్‌తో బాటు, దానిలోని పర్పస్ కూడా సాంగ్‌లోకి తీసుకురావడానికి ఆయన మాక్జిమం ప్రయత్నించడం. ఆ విజువల్స్ దానికి సూట్ అయ్యేలా ఉండడం. ఇలా రకరకాలుగా అవినాభావ సంబంధం.

పాట అంటే కేవలం సాహిత్యం కాకుండా, నా డైరక్షన్ని , నా సినిమా కోసం నేను అనుకున్న దానికి ఆయన అక్షరం, ఒక దృశ్యరూపం రావడానికి, ఒక కెటలిస్టులాగ పనిచేస్తుంది. ఒకొక్కప్పుడు నాకు కొంత అస్పష్టంగా ఉన్న విజువల్స్ కూడా ఆయన మాట పడగానే 'ఓహో! ఇలాంటి విజువల్ అయితే కరెక్టుగా ఉంటుంది' అని తడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ 'మురారి’ సినిమాలో సాంగ్ చేస్తున్నపుడు -

'పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుని మునివేళ్ళు -

పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలూ

యాజటీజ్‌గా దీనికోసమనే హీరో మూడు ముడులు వేస్తూ ఎవరికీ తెలియకుండా హీరోయిన్ని గిల్లడం అనేది, నాకు పెళ్ళికాలేదు కాబట్టి అటువంటి అనుభవం లేకపోయినా ఈ మాటను పట్టుకుని ఆ విజువల్‌ను షూట్ చేసాను. దానికి చాలా అప్రిసియేషన్ వచ్చింది. అక్కణ్ణించి మొదలై వాళ్ళిద్దరూ హోమగుండం చుట్టూ తిరుగుతున్నపుడు చెయ్యి గిల్లడం వాళ్ళిద్దరి మధ్య 'స్పర్శ ' అనేది ఫస్ట్ టైం అలా అక్కడే మొదలవుతుందనేది ఒక విజువల్‌గా తెరకెక్కించగలిగాను అనుకుంటున్నాను.

పెళ్ళి పాటలను గురించి చెప్పాల్సి వస్తే -  నేనింతవరకు నాలుగు సినిమాల్లో శాస్త్రిగారిచేత నాలుగు పెళ్ళి పాటలు రాయించుకున్నాను. (అది కూడా ఇప్పుడే నాకు తెలిసింది) ఈ నాలుగు పాటల్లో మాటర్ ఒకటే అయినప్పటికీ, డిఫరెంట్   సిట్యుయేషన్స్‌లో డిఫరెంట్  పాటలు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ 'మురారి'లో సాంగ్‌కు ఇస్తాను. 'మురారి'లో పెళ్ళిపాట పెట్టడానికి కారణం. ఇది పూర్తిగా మన కల్చర్, ట్రెడిషన్ బాక్ డ్రాప్‌లో తీసిన సినిమా. హీరో మహేష్ బాబు ముగ్ధ మనోహర రూపం. ఆ రూపం శ్రీరామచంద్రుడిలా అనిపించింది. ఎక్కడో ఒకప్పటి ఎన్.టి ఆర్‌లాగా అనిపించింది. సో.. అక్కణ్ణించి కనెక్టయి వెళ్తే, ఆ అబ్బాయి, అమ్మాయిలకి పెళ్ళి జరిగితే బావుణ్ణు  అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగజేసేందుకు, ఆ పెళ్ళి జరిగితే ఆ అమ్మాయి చచ్చిపోతుందని తర్వాత చెప్పడం కోసం, అది ఎఫెక్టివ్‌గా ఉండడం కోసం.. ఆ పెళ్ళి జరిగితే ఎలాంటి పెళ్ళి జరుగుతుంది అనేది చెప్పడం కోసం ఒక సిట్యుయేషన్ తయారు చేసుకున్నాం.

జనరల్‌గా 'పెళ్ళి' అనగానే మనకి గుర్తొచ్చేది 'సీతారాముల కళ్యాణం', ఇప్పటికి సుమారు యాభై సంవత్సరాలుగా 'సీతారాముల కళ్యాణము చూతము రారండి ' అనే పాట, అటువంటి పాట ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. నేను అలా షూట్ చేస్తాను - అలాగే పెళ్ళి పుస్తకంలో బాపుగారు పెళ్ళి మీద, హీరో హీరోయిన్ల మీద క్లోజప్స్‌లోనే షూట్ చేసారు. - సీతారాముల కల్యాణము చూతము రారండి సాంగ్ ట్రాక్, ఆ ఆలాపన అలాగే వాడదాం. విజువల్స్ బాపుగారి సినిమాలోలాగ ఉండి, పెళ్ళికి సంబంధించిన అన్ని వేడుకలు, పెళ్ళి దగ్గరనుంచి శోభనం వరకు వేడుకలన్నీ కలిపి వచ్చేలాగ షూట్ చేద్దామని వుంది. దానికి తగ్గట్టు మహేష్ బాబు, సోనాలి బింద్రే సీతారాముల్లా ఉన్నారు. వోన్లీ వాళ్ళ ఫామిలీ మెంబర్ల ధ్యే రిట్యుల్స్ అన్నీ జరుగుతాయి అని పాటకు రిఫరెన్సు ఇస్తే, దానిమీద ఆయన పాట రాసిచ్చారు. ఇప్పటికీ నాకు బాగా ఇష్టమైన ఆ పాటలో ఇందాక చెప్పినట్టుగా -

'చందమామ చందమామ కిందకి రావమ్మా

ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా '

అనేది అక్షరాలా మహేష్ బాబుని పెళ్ళికొడుకు గెటప్‌లో నేను ఎలా చూస్తున్నానో, దాన్ని స్క్రీన్ మీదికి ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి ఈ వాక్యాలు ఉపయోగపడ్డాయి. అలాగే అమ్మాయి గురించి ఇందులో నచ్చిన లైను -

తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన

శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ..'

పాటలో ఆయన ఎంత పవిత్రమైన పదాలు వాడారో నేను తెరమీద అంత పవిత్రంగానూ చూపడానికి ప్రయత్నం చేసాను. జనరల్‌గా ఏ సాంగ్ అయినా మినిమం ఆరురోజులు షూట్ చేస్తాను. అలాంటిది ఈ సాంగ్ మాత్రం రెండున్నర రోజులలో అయిపోయింది. దీనికి కారణం 'లిరిక్' సపోర్ట్ ఉండడం. ఒక ప్రత్యేకమైన మండపం వేసుకుని ఫ్యామిలీ మెంబర్ల ధ్య తీసిన పాట.

అలాగే 'నిన్నే పెళ్ళాడుతా ' సాంగ్, ఆ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్, రిలేటివ్స్ అందరికీ తెలిసినా, వాళ్ళు తెలీదు అన్నట్లుగా ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ వాళ్ళకెలా చెప్పాలో తెలీదు. చెప్తే ఏడిపిస్తారని యం. ఇతర సినిమాల్లోలాగ చెపితే కోప్పడతారన్న భయం కాదు. ఏడిపిస్తారని భయం. బికాజ్, ఫామిలీలో మెంబర్సు అందరూ అటువంటి వాళ్ళు. వాళ్ళకీ వీళ్ళిద్దరూ ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. వాళ్ళందరూ కలిసి హీరో, హీరోయిన్స్‌ని ఏడిపిస్తున్నారు. ఇదీ సిట్యుయేషన్. ఇక్కడ మారేజ్ అట్మాస్ఫియర్ వుండదు. కానీ మారేజ్ గురించి టాక్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో విచిత్రం ఏంటంటే మారేజ్ జరక్కుండా ఆ రిట్యుల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారందరూ. ఇందులో పెళ్ళవని బాబాయి ఉంటాడు. వాడు 'ప్రేమ దాకా ఓ.కే. పెళ్ళి మాత్రం షాకే!' అని వాళ్ళన్నయ్య ఒకటి చెప్తుంటాడు. వాళ్ళ నాన్న ఒకటి చెప్తుంటాడు.

అలాగే చెల్లెలికి పెళ్ళి కుదిరినప్పుడు అన్నయ్య పాడే పాట 'సముద్రం 'లో అందులో -

'పెళ్ళి మాట వినందేమో పిల్లకోతి ఫేసు కూడ

చూడ చక్కగానె వుందిరోయ్ '

అన్న ఎక్స్‌ప్రెషన్ జనరల్‌గా చెల్లెళ్ళని 'కోతి ', 'కోతి అ ని ఏడిపించడం చేస్తాం. కోతి ముఖం కూడా పెళ్ళిమాట వినగానే అందంగా మారిపోయింది అనడం.

'ఆటలొచ్చు పాటలొచ్చు అల్లరొచ్చు నవ్వులొచ్చు

ఏడుపంటె చేతకాదయా '

లాంటి ఆర్ర్ధతాపూరితమైన భావాన్ని ఇంత అల్లరి పాటలో అలవోకగా పెట్టేయగలగడం... ఆ సడన్ జెర్క్ ఆఫ్ ఎమోషన్ జంప్ ఆఫ్ ఎమోషన్. నాకు షూట్ చెయ్యడం చాలా కష్టం అయింది కూడా.

తర్వాతది మ్యారేజ్ దగ్గర నుంచి మాతృత్వం దాకా, మాతృత్వం మరో జన్మ అంటారు. వీటన్నిటినీ కల్బోసి రాసిన పాట 'అంతఃపురం'లో 'కళ్యాణం కానుంది ' అనే పాట. ఈ పాటలో కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్

'రావమ్మ సీతమ్మ సిగ్గు దొంతరలో '

ఇందులో సిగ్గనేది దొంతరలు దొంతరలుగా వుందనే ప్రయోగం నాకు విపరీతంగా నచ్చింది అలాగే -

'ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి

పాపాయి చేసి నా ప్రాణాలే పోసి

నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా '

అంటూ సంతోషాన్నంతటినీ మూటగట్టి పాపాయిగా నీకిస్తానని ఒక భార్య భర్తకి చెప్పడం చాలా బావుంది.

ఇలాంటి ఫెంటాస్టిక్ లిరిక్స్‌తో నేను అసోసియేట్ అయినందుకు చాలా హాపీగా ఫీలవుతుంటాను. అందుకనే నేను ఆయన్ను నానా హింసా పెడుతుంటాను. ఆ హింస ఆయనకూ ఆనందమే. నాకూ ఆనందమే. అప్పుడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఫైనల్‌గా ఆయన విసిరేసిన పేపరు.. అది సాంగ్ షేప్ రావడం, పాడించడం, పాడించిన దాన్ని షూట్ చెయ్యడం. షూట్ చేసిన దాన్ని ఎడిట్ చెయ్యడం, ఎడిట్ చేసినదాన్ని చూసుకోవడం. ఇదో పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ సోల్...హార్ట్.. నూక్లియస్... అన్నీ. ఆల్వేస్ శాస్త్రిగారి లిరిక్స్ అయి ఉంటాయి.

 

హైదరాబాద్

1.2.2003

కృష్ణవంశీ      సినీదర్శకుడు

 

 

అలనాటి రామచంద్రుడి 

ఈ శీర్షికని ఈ పాటతో ప్రారంభించడంలో ఒక విశేషం ఉంది.  'మురారి ' చిత్రాన్ని తీస్తూ చిత్ర దర్శకుడు శ్రీ కృష్ణవంశీ ఈ పాటను రాయాల్సిందిగా శాస్త్రి గారిని కోరారు. పాట ఎలా ఉండాలి, పాట ద్వారా ఆయన ఏం సాధిద్దామనుకుంటున్నారు అనేది నిర్ద్వంద్వంగా చెప్పడం కృష్ణవంశీ ప్రత్యేకత.

సీతారాముల కళ్యాణం అనే చిత్రంలో 'సీతారాముల కళ్యాణము చూతము రారండి' అనే పాట పొందినంత ప్రజాదరణ పొందేలా పెళ్ళి సందడిని, పెళ్ళిలోని వివిధ వేడుకలను వర్ణిస్తూ పాట ఉండాలని కృష్ణవంశీ సూచన.

వర్ణనలో కూడా వ్యంగ్యోక్తి నిండిన పాట ఇది. వ్యంగ్యోక్తి అంటే ఏమిటి? మనం చదువుతున్న పదాలు - ఆ పదాలకున్న నిఘంటు అర్ధాన్నే కాకుండా మరో అర్ధాన్ని వ్యక్తపరచడమే. ఇది కవిత్వానికి ప్రాణం.

కవిత్వపు లక్షణాలు, దర్శకుడి కోరికల మేటి మేళవింపుగా సాగిన పాట ఇది. ఈ పాట వెనుక మరొక విశేషం ఉంది. ఏ పాటనైనా రాయాలంటే కవి తాను రాస్తున్న సన్నివేశంలోకి మానసికంగా వెళ్ళిపోవాలి. ఈ పాట రాసే సమయంలో శాస్త్రిగారి కుమార్తె అయిన శ్రీ లలితాదేవి వివాహం జరుగబోతున్నది. ఇంకేం. ఊహ, వాస్తవం నేస్తం కట్టాయి. ఒక అద్భుతమైన పాట రూపొందింది.

అబ్బాయి సాటిలేని వరుడు. సాక్షాత్తు శ్రీహరి ఇంటికే వెలుగు తెచ్చే దీపమంటి అపరంజి పెళ్ళికూతురు. వీరిద్దరి అందాలు చూసి చందమామ, వెన్నెల కూడా వెలవెలబోవాలట. తన చుట్టూ వందలాది మంది ఉన్నా, ఎలాగైనా పెళ్ళికూతురిని స్పృశించాలనే తహతహ, అతని చేయి తగలగానే ఆమెలో కలిగే తన్మయత్వం కేవలం రెండు లైన్లలో ఎంతో భావాన్ని నింపి శ్రోతలందరినీ ఊహాలోకాల్లోకి, కొందరిని గతంలోకి, కొందరిని అనాగతంలోకి ప్రయాణం కట్టించారు శాస్త్రిగారు. ఇందులో మరో విశేషం ఉంది. ఈ పాట బాణీని కూడా శాస్త్రిగారే సూచించిన మీదట, సంగీత దర్శకుడు శ్రీ మణిశర్మకు ఈ సూచన నచ్చి, దానికే మెరుగులు దిద్ది ఒక అద్భుతమైన బాణీగా మలిచారు.

 

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి

ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్ని మేటి

అనిపించె అరుదైన అబ్బాయికి మనువండి

 

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన

శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన

ఆతువంటి అపరంజి అమ్మాయిని కనరండి

 

చందమామ చందమామ కిందికి చూమ్మా

నేల మీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా

వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

 

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు

చ్చని మెపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు

నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు

ద్దరి తలపును ముద్దగ తడిపెను తుంరి జలకాలు

ఆందాల జం అందరి కంటికి విందులు చేసే సమయానా

కలలకు దొరకని  కళగల జంను పదిమంది చూడండి

తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి ॥చందమామ

 

 

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా

విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంపాన

గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా

మరగలేదు మన్మధుని వొల్లు ఈ చల్లని సమయాన

దేవుళ్ళ  పెళ్ళి  వేడుకలైన ఇంత ఘనంగా జరిగెనా

 ఆనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి

దుపరి వివరములగక బంధువులంతా కదలండి ॥చందమామ

 

 

ఈ పెళ్ళి దేవుళ్ళ పెళ్ళి కంటే ఘనంగా జరిగింది. చూశారు కదా! మరింక నూతన దంపతులనిద్దరినీ వదిలిపెట్టి బంధువులంతా కదలండి అని కొత్తగా, కొంటెగా ముగించారీ పాటను. ఎన్నిసార్లు చదివినా, విన్నా 'వన్స్‌మోర్ ' అనిపించే పాట యిది

 

 

(కొనసాగింపు వచ్చేసంచికలో)