ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!
సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, గీతరచయిత పేరు కూడా కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
 
బోసినీర్విప్పితే – ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే – వరహాల వర్షమే!

(2)
బ్యాంకులో డబ్బు దాచేవారు
నీశక్తిని గమనించరు వారు

(3)
బలవంతులు దోచేసిన రాజ్యం
 ప్రజలందరికి భోజ్యం కాద

(4)
మీనులాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నామదిని జప్తుచేసినై

(5)
వలపను మాటలోన ముందే వుంది – వల
కలవారి కావ్యములో తొలిపలుకే – కల
(6)
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
(7)
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళయిన తాగి బతకాలి
(8)
నిదుర మబ్బులను మెరుపుతీగవై
కలలు రేపినది నీవే
(9)
కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని
 
(10)
నది దోచుకుపోతున్న నావను ఆపండి
 
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!