ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 అలనాటి విజయా పిక్చర్స్ వారి సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
ఉన్నది పగలైనా
అహ వెన్నెల కురిసేనే

(2)
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను..!

(3)
చొరవచేసి రమ్మనుచో
మరియాదగ పొమ్మనిలే

(4)
మేలుకొనీ, కలలు గనీ
మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకొనీ..

(5)
పరీక్షకోసం దిగులుపడకురా
వచ్చేయేటికి ప్యాసౌదువులే..
(6)
సింగారి వీధంట మామ..
రంగేళీ పిల్లంట
(7)
సతిపతి పోరే బలమై
సతమతమాయెను బ్రతుకే..
(8)
పలకకున్న ఏమాయెను
వలపు బాసలింతేలే..
(9)
విరి తావుల ఉరవడిలో విరహమతిశయింపగా..
(10)
గుబుల్ గుబుల్ గా - గుండెలదరగా..
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!