సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 

ఔనా! ఊరించే ఏదో ఊసే విన్నా

 

|| ఔనా! ఊరించే ఏదో ఊసే విన్నా

    ఔనా! ఊరంతా కోడై కూసే నిన్న

    ఔనా! గారాల కారాగారం చేసే

    తరుణమే తరుముకొచ్చేనంట

    పరిణయం తగిన శిక్షేనంట

 

ఆ: ఈడు ఒళ్ళంతా వన్నెల విరులయ్యింది

    చూడు ఒయ్యారం ఓపని బరువయ్యింది

    తోడు మూడంటే మూడే ముళ్ళడిగింది

    అందుకే లగ్నపత్రిక అందుకో రాగమాలిగ      ||ఔనా||

 

1. ఆ కొమ్మలో రాచిలకలే చదివే ప్రణయ పంచాంగం

       ఈ పొదరిళ్ళ ఏకాంతాన కుదిరే మనకు సుముహూర్తం

ఆ: పారే ఏటినీరే స్వరాలూదే వేదమంత్రాలు

    వీచే గాలి తీసే కూని రాగం పెళ్ళి బాజాలు

అ: మనచుట్టూ చెట్టు చేమా చుట్టాలు పక్కాలు

ఆ: పన్నీరు అత్తరు జల్లే కన్నెపూల గంధాలు

అ: నీలి నింగి దీవెన తెచ్చే నక్షత్రాలే అక్షతలు      చూడు

 

2.ఆ: నాలో తొలకరించే పులకరింపే నీకు వరమాల

       నీలో తలుపు తీసే చిలిపి ఆశే బదులు పలికేలా

అ: దూరాలన్నీ తీరే దారి చూపించాలి సింగారం

నా ఉదయాలు పూయించాలి నీ అందాల సిందూరం

ఆ: అరమోడ్చిన రెప్పల్లో ఆరాటం నిట్టూర్చాలి

అ: ముచ్చెమటల ముస్తాబులో తొలిబిడియం చెట్టెక్కాలి

ఆ: ఆ వెచ్చని ముచ్చటలే నూరేళ్ళు వెలిగించాలి      ఔనా

 

(చిత్రం: భలేమొగుడు; సంగీతం: సత్యం; గానం బాలు, ఎస్.పి.శైలజ)

 

ముస్తాబయ్యే ముద్దులగుమ్మా

 

ఆ: ముస్తాబయ్యే ముద్దులగుమ్మా తరుముకొచ్చే సుమూహూర్తం

       సిగ్గులు పూచే కలికి కొమ్మ జరగనుందే శుభకార్యం

అ:    మనసుపడు సన్నాయి రాగం మోగుతోంది

       ముడులుపడు కళ్యాణయోగం ముంగిట ఉంది     ముస్తాబయ్యే

 

॥ 1. కలలు గను నీ కళ్ళ వాకిళ్ళని తెరచినది ముత్యాల ఆ పల్లకి

         నిలవనను పారాణి పాదాలనే నడిపినది బంధాల పందిళ్ళకి

 

అ: ఎదురుపడే ఈడుజోడు చేర్చు ఆ నిక్కా

ఆ: ఇద్దరికి ఉంగరాలు మార్చు ఎంచక్కా

ఆ: 'ఇషా అల్లా ' అన్నది పిల్లా హనీమూన్‌కే చెక్కేయ్ ఇల్లా

అ: బంధుగణమందరి మధ్య తన ముడి బిగియునట    ముస్తాబయ్యే

 

కోవాసి గలవాడు ఆశగలవాడు చూడమ్మా

     రాముడై నిన్ను ఏలునే వాడు సీతమ్మా

     గుణగణములకు ఘనుడు వరుడు మరుడు

     నీ బ్రతుకున వెలుగులొలుకు వరము వస్తున్నదిదిగో

    నిన్నుమనువాడు నిండు మగవాడు వాడమ్మా

ఆ: ఇది వరకు ఇల్లాంటి ఏ వేడుక ఎరుగమని ఊరంత కీర్తించగా

    కని వినని కళ్యాణి వైభోగమే జరుగునిక నేస్తాలు సాక్ష్యాలుగా

అ: నేను అవుతాను చూడు నేడు నీ ఖాజీ

    చదవనా 'ఆమెన్ ' అంటూ బైబిల్లో పేజి

ఆ: మతాలన్ని ఒకేచోట తథాస్తంటూ పలుకునంట

అ: స్నేహమే అక్షింతలుగా కురిసిన సమయమమట  ముస్తా

 

(చిత్రం: జాలీ; సంగీతం: కవి, గానం: యస్.పి చరణ్, సుజాత)

 

 

 
 

 

 (కొనసాగింపు వచ్చేసంచికలో)