ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

 వేటూరి గారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
పొగడలు పొన్నలాయెనే యెన్నెలా
మనుగడ మీగడాయెనే

(2)
రాధలాగా మూగబోయా పొన్నచెట్టు నీడలో
వేసవల్లె వేచిఉన్నా వేణుపూలతోటలో

(3)
జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే
నీ తహతహ చూస్తున్నా

(4)
ఈ సప్తవర్ణాల నా స్వప్నరాగాల పాటల్లో ప్రథమాక్షరి
ఇది ప్రాణాల పంచాక్షరి

(5)
పూబంతి పూతకొచ్చి చేమంతి చేతికిచ్చి
పులకింత గంధాలు చిందించనా
(6)
 ఈడుకున్న గూడు నువ్వె గోరింక
తోడుగుండి పోవె కంటినీరింక
(7)
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
(8)
 చినుకులు చిటపటమంటుంటే
చెమటలు చందనమౌతుంటే
(9)
వయసు వడగళ్ళవాన నీరు గూడుకట్టింది ఎందుకో
(10)
 సుడిలోకి దూకాలిరా కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే తడాఖా మజాకా చూపరా..!
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!