ప్రతినెలా ఈ శీర్షిక సినీ గీతాభిమానులకు సత్కాలక్షేపం..!

ఆరుద్ర గారు వ్రాసిన సినిమా పాటల్లోని మధ్యలో కొన్ని పంక్తులు క్రింద ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులు ఏ పాటలోవి, సినిమా పేరు, కనుక్కోవడమే మీరు చెయ్యాల్సిన పని. సమాధానాలకోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

(1)
నీరిడిసి పేడితే సేప బతికుంటదా..
నీతిడిసి పెడితే మనిషి పరువుంటదా..!

(2)
ఓ స్వామీ మాకు ఇచ్చావు నువ్వో తాళం
అంతర్యామీ కాని చేశావు మాయాజాలం..!

(3)
ఈ సంఘంలో ఎదగడమే దండగ
మంచికాల మొకటి వస్తుంది నిండుగా

(4)
బిరుదులు పదవుల మీద - పరనారీ పెదవుల మీద
బుద్ధంతా నిలిపేవాడు బూడిదై పోతాడు

(5)
ఎందుకయ్యా పడతావు హైరానా
నేనిచ్చాగా నా మనసు బయానా..!
(6)
తండ్రిమాట దాటలేని రాముడైనను
ఆలితో అడవులందు హాయి పొందెను
(7)
ఆ కన్నీరే లంకాపురమున
అయినది పెద్దకోనేరు
(8)
మోజుపడకుంటే మగవాడె కాదు
గడసరి బిగువు సడలించనిదే జవరాలే కాదు..
(9)
రావాలనుకుని వచ్చావు
ఇక పోవాలన్నా పోనీను..
(10)
మురిసిపోవు మనసులోని మధురభావన
మరుపురాని మరువలేని ఎవరి దీవెన..!
సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!