దాదాపు 12 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
26

కుర్ర తరంగం

 
పేకల్లో జోకర్లా ఎవడే ఈ షోకిల్లా
మ్యాజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే
చుట్టాడే తలపాగ పెట్టాడే నెమలీక
బుడబుక్కుల బూచాడల్లే దసరావేషం కట్టాడే
పదిమంది చూస్తే పకపకా నవ్వేలా!

ఎల్.కె.జీ లెక్కలకి కాలేజి కొలతలకి
ఎన్నెన్నో తేడాలుంటాయ్ చూడాలె కులుకమ్మా
ఎలిమెంటరీ బట్టల్లో నలుదిక్కులు చుట్టొస్తే
జనమంతా గగ్గోలెట్టి చస్తారే చిలకమ్మా
అవతారం చూస్తే అదోరకం అదమ్మా!

అల్ల త్రేతాయుగం నుంచి దూసుకువచ్చారా
విల్లు బాణాలు ఏవండి తీసుకు వచ్చారా
గిల్లిపోతానె వళ్ళంతా పుల్లని నారింజ
గొల్లుమంటావె నాతోనె అల్లరి ఛాలెంజా

తోక చుక్కల్లె దొరవారు ధీమాగా దిగినారు
ఏ దేశం ఏలేవారో ఆదేశం ఇస్తారు
పంతాల కుందేల పంజా రుచి చూస్తావా

మంచి ఉమ్మస్సు మీదుంది అమ్మడి వయస్సు
కొత్త సిలబస్సు చెపుతుంది సొంపుల ఛందస్సు
వచ్చి అక్కసు మీదుంది గుంటడి వర్ఛస్సు
ఖడ్గతిక్కన్నకేడుంది ఇంతటి తేజస్సు
ఉత్తి ఆకారం ఏముందే - అసలంతా లోనుందే
సందేశం కావాలంటే సావాసం చెయ్యండే
పల్నాటి పుంజల్లే రోషం రెచ్చాడే!

(అసెంబ్లీ రౌడి చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీత సారధ్యంలో బాలు, చిత్ర పాడినది)


***


హిందీ మే తూ చార్ సౌ బీస్
ఇంగ్లీష్ నేమీజ్ 420
తెలుగులో ముచ్చటగా పచ్చి దగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయ్యో

ట్రంకు రోడ్డు బండి టీనేజి లోడ్ నిండి ఈ డొంక రోడ్డు పట్టిందండి
జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే ఈ చోటు దాటిపోలేదండీ
ఇంజనులో హీటెక్కిందే అబ్బ చెయ్యేస్తే చుర్రంటుందే
జాగర్త వెళ్ళకలా వెల్లికిలా పడతావే
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యో అయ్యయ్యో

ఎంత గుబాళింపు నువ్వంటుకునే షాంపూ
నా సొమ్ముకన్న చవకా చెప్పు
లిప్‌స్టిక్ కన్నా - మేకప్ ఖర్చుకన్నా - ఏమెక్కువమ్మ ఈ నా అప్పు
ఎంతమ్మా ట్వంటీ రూపీస్ - అంతేగా ఇచ్చెయ్యి ప్లీజ్
ఎర్రని ఏకానీ వదలనుగా నేనసలు
ఇరవైకి పైసైనా ఇవ్వనుగా కన్సెషను
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యో అయ్యయ్యో

(బొబ్బిలిరాజా చిత్రానికి ఇళయరాజా సంగీత సారధ్యంలో బాలు పాడినది)


                        ***

కోకో కోపమా కొత్త సిగ్గు దీపమా ఎర్రగా కందెనమ్మా
పైపై పంతమా పట్టు నెగ్గు పందెమా వెర్రిగా తూగెనమ్మా
ఈ గయ్యాళి గంగమ్మ కోపం ఏ కొంప ముంచేందుకో
ఈ వయ్యారి వాగమ్మ వేగం కింద మీద చూడకుండ పొంగుతోంది ఎందుకో

పాలపొంగు చేలలో నీటిమీద కోపము
నేలపాలు కాకముందె ఆపినందుకా
నీలిమబ్బు కేలనో నేలమీద కోపము
గుండెలోని భారమంత దించినందుకా
పాపమ్మో ఇక ఆపమ్మో కవ్వించే పోరాటం
పోనీలే అని చూస్తుంటే శృతి మించిందే నీ వాటం
కొద్దిగా బుద్దిగా ఆడపిల్ల తీరుగా
హద్దులో ఉండకుండ ఇంత అల్లరెందుకో

రాసనిమ్మ పండులో ఎంత రోషముందిరో
పళ్ళు రాలిపోవునంత పుల్లగుందిరో
ఉల్లిపాయ గుండెలో ఎంత ఘాటు ఉందిరో
కళ్ళనీరు ఊరుదాక ఊరుకోదురో
ఉడతమ్మా నువు ఊపేస్తే పడిపోవాలా పళ్ళన్ని
జింకమ్మా నువు జడిపిస్తే జంకాలా పులులన్నీ
పిచ్చుకా ఊరుకో పిచ్చిపనులు మానుకో
నవ్వుకుంటె గోడపెచ్చులూడవమ్మా ఒప్పుకో

(పండుగ చిత్రంలో కీరవాణి సంగీత సారథ్యంలో బాలు పాడినది)

                    ***
అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడామెడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం
మీ ఇళ్ళలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం
కూకూ అని గుడ్లగూబనే కూయించమంటా నా ఇష్టం
బజారులో పుట్టగోచితో పచారు చేస్తా నా ఇష్టం
నడీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం
దుబాయికి పెట్రోలుని ఎక్స్‌పోర్టు చేస్తా నా ఇష్టం
అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం

హిస్టరీ కొత్తగా రాయమంటా - హిట్లర్‌ని దేవుడిగ చేయమంట
మారుతీ కారునే తోలుకొస్తా - చేలల్ని దానితో దున్నమంటా
షటిల్‌కాకుతో బౌలు చేస్తా - చేసి సచిన్ టెండుల్కర్ని అవుట్ చేస్తా
టైగర్ని పచ్చగడ్డి మేయమంటా - పావురానికి బాంబులు ఇచ్చి వేయమంటా
అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం

బ్యూటిఫుల్ భామనే పట్టుకొస్తా - అటల్‌బిహారి కిచ్చి పెళ్ళి చేస్తా
తీహారు జైలు ఎంత గొప్పదంట - దేశరాజధాని అని చెప్పమంట
అసెంబ్లీకి నేను పోటీ చేస్తా - చేసి ఎక్స్‌పార్టీ ఓడికి ఓటు వేస్తా
కంప్యూటర్‌లో పత్తిపంట వేస్తా - దాంతో చంద్రబాబునాయుడికి షర్టు నేస్తా
అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం

(కౌరవుడు చిత్రానికి మణిశర్మ సంగీత సారథ్యంలో మురళీధర్, ధర్మతేజ పాడినది)

 

(కొనసాగింపు వచ్చేసంచికలో)